“సీఏఏ”కు మద్దతుగా వీహెచ్‌పీ ర్యాలీ.. రాళ్ల దాడితో చెలరేగిన హింస..

జార్ఖండ్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో.. హింస చెలరేగింది. లోహర్‌డగా పట్టణంలో వీహెచ్‌పీ తరఫున పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో కొందరు దుండగులు ర్యాలీపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దుండగులు సీఏఏ మద్దతు దారులపై దాడులకు దిగడంతో.. ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆందోళనకారులు.. పలు వాహనాలు, దుకాణాలకు నిప్పుపెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆందోళన కారులను చెదరగొట్టారు. […]

సీఏఏకు మద్దతుగా వీహెచ్‌పీ ర్యాలీ.. రాళ్ల దాడితో చెలరేగిన హింస..
Follow us

| Edited By:

Updated on: Jan 24, 2020 | 1:10 PM

జార్ఖండ్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో.. హింస చెలరేగింది. లోహర్‌డగా పట్టణంలో వీహెచ్‌పీ తరఫున పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో కొందరు దుండగులు ర్యాలీపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దుండగులు సీఏఏ మద్దతు దారులపై దాడులకు దిగడంతో.. ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆందోళనకారులు.. పలు వాహనాలు, దుకాణాలకు నిప్పుపెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆందోళన కారులను చెదరగొట్టారు. ముందస్తు జాగ్రత్తగా సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించారు. లో‌హర్‌డగా పట్టణంలో144 సెక్షన్‌‌ను విధించారు.

కాగా, పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరనసలు వెల్లువెత్తాయి. యూపీ, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, అసోం రాష్ట్రాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పలుచోట్ల హింస చెలరేగింది. ముఖ్యంగా యూపీలో దుండగులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడంతో.. యోగీ సర్కార్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇదిలావుంటే…సీఏఏకు వ్యతిరేకంగా కేరళ, పంజాబ్ రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలను ఆమోదించాయి. అంతేకాదు.. ఈనెల 27న వెస్ట్ బెంగాల్‌లో కూడా.. అసెంబ్లీలో తీర్మానం ఆమోదిస్తామని దీదీ ప్రకటించారు.