Drunken Teacher: వీడేం టీచర్.. తప్పతాగి స్కూల్ కి వచ్చి.. పాట పాడుతూ నేల మీద పొర్లిన హెడ్ మాస్టర్..

ఉదయం 11 గంటలకు ఫుల్​గా మద్యం తాగి.. తూగుతూ నేను మద్యం మాత్రమే తాగాను.. ఏమీ దొంగలించలేదంటూ ఓ హిందీ పాటను పాడుకుంటూ స్కూల్ కు వచ్చాడు. మరాండి నేలపై పడి దొర్లుతూ.. పాటలు పడుతుండడంతో పాఠశాలలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.

Drunken Teacher: వీడేం టీచర్.. తప్పతాగి స్కూల్ కి వచ్చి.. పాట పాడుతూ నేల మీద పొర్లిన హెడ్ మాస్టర్..
Drunken Teacher
Follow us

|

Updated on: Aug 13, 2022 | 8:41 AM

Drunken Teacher: స్కూల్ కి వచ్చిన స్టూడెంట్స్ కు మంచి చెడులను గురించి చెబుతూ.. విద్యా బుద్ధులను నేర్పించాల్సిన ఉపాధ్యాయులే భాద్యత మరచి ప్రవర్తిస్తున్నారు. పట్టపగలే తప్పతాగి పాఠశాలకు వచ్చి.. నానా యాగీ చేస్తున్నారు. పాఠశాలకు హెడ్ గా తోటి టీచర్స్ కు, స్టూడెంట్స్ కు మార్గదర్శకం చేస్తూ.. ఆదర్శంగా నిలవాల్సిన ఓ ఓ ప్రధానోపాధ్యాయుడి ప్రవర్తన ఉపాధ్యాయ వృత్తికే మచ్చగా మారింది. స్కూల్ జరుగుతున్న సమయంలో తాగి వచ్చి పాఠశాలకు వచ్చాడు. ఈ ఘటన ఝూర్ఖండ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఝూర్ఖండ్ దుమ్కాలో షికారిపాడు బ్లాక్​లోని దర్బార్​పుర్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గా ఆండ్రియాస్ మరాండి పని చేస్తున్నాడు.  ఆయన గురువారం ఉదయం 11 గంటలకు ఫుల్​గా మద్యం తాగి.. తూగుతూ నేను మద్యం మాత్రమే తాగాను.. ఏమీ దొంగలించలేదంటూ ఓ హిందీ పాటను పాడుకుంటూ స్కూల్ కు వచ్చాడు. మరాండి నేలపై పడి దొర్లుతూ.. పాటలు పడుతుండడంతో పాఠశాలలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని స్టూడెంట్స్ తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో మరాండిని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా మందలించారు. వెంటనే గ్రామస్తులు గుమిగూడి ఘటనను వీడియో తీశారు. ఆండ్రియాస్ మరాండీకి తన కుర్చీలో కూర్చునే శక్తి లేదని.. ఫుల్ గా మద్యం మత్తులో ఉన్నాడని చెబుతున్నారు.

ఇలా ఉపాద్యాయుడు మద్యం తాగి స్కూల్ కు రావడం ఇదే మొదటి సారి కాదు..  ఇంతకుముందు ఇలాంటి సంఘటన జరిగింది. కానీ విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఈ సారి ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ.. గురువారం నాడు ఈ ఘటన జరిగిందని, సీఆర్‌పీని పాఠశాలకు పంపి విచారణ చేపట్టామని చెప్పారు. విచారణ నివేదిక అందిన తర్వాత సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..