Farmers Protest: రైతు సంఘాలతో సుప్రీం ఏర్పాటు చేసిన కమిటీ చర్చలు.. కేంద్ర ప్రతిపాదనలను తిరస్కరించిన రైతు సంఘాలు

Farmers Protest: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై కొనసాగుతున్న రైతుల ఆందోళన కొనసాగుతోంది. అయితే సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ రైతు...

Farmers Protest: రైతు సంఘాలతో సుప్రీం ఏర్పాటు చేసిన కమిటీ చర్చలు.. కేంద్ర ప్రతిపాదనలను తిరస్కరించిన రైతు సంఘాలు
Follow us

|

Updated on: Jan 21, 2021 | 9:25 PM

Farmers Protest: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై కొనసాగుతున్న రైతుల ఆందోళన కొనసాగుతోంది. అయితే సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ రైతు సంఘాలతో గురువారం చర్చలు జరిపింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 8 రాష్ట్రాల్లో 10 రైతు సంఘాలతో చర్చలు జరిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలను రైతు సంఘాలు తిరస్కరించాయి. సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు తీర్మానం చేశాయి. శుక్రవారం నాటి చర్చల్లో కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. అయితే కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై కొనసాగుతున్న రైతుల ఆందోళనపై కేంద్ర సర్కార్‌ కొంత వెనక్కి తగ్గేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొత్త వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నర పాటు నిలిపివేసేందుకు సిద్ధమని కేంద్రం తమకు తెలిపిందని రైతు సంఘాల నేతలు ఇది వరకే తెలిపారు. అయితే ఈ వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ప్యానెల్‌ రైతులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ చర్చల్లో కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 10 వేర్వేరు రైతు సంఘాలు పాల్గొంటున్నాయి. అయితే వివాదస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు తమ ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని రైతు సంఘాల నాయకులు తెగేసి చెబుతుండగా, సవరణలను ఒప్పుకుంటాం తప్ప చట్టాలను పూర్తిగా రద్దు చేసే అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన పదో విడత చర్చల్లో ప్రతిష్టాంభన కొనసాగడంతో జనవరి 22న మరోసారి రైతు సంఘాలతో చర్చలు జరపాలని కేంద్రం నిర్ణయించింది.

ఇదిలా ఉండగా, సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్‌ తన మొదటి సమావేశాన్ని మంగళవారం నిర్వహించింది. వ్యవసాయ చట్టాలకు సభ్యులు సానుకూలంగా ఉన్నారని, సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్‌ను రైతులు తిరస్కరించారు. చట్టాలను రద్దు చేయడం, పంటలకు కనీస మద్దతు ధర తప్ప మరో ప్రతిపాదనకు ఒప్పుకునేది లేదని రైతులు స్పష్టం చేశారు. అయితే చట్టాల రద్దు మినహా దేనికైనా అంగీకారమేనని స్పష్టం చేసిన కేంద్రం.. తాజాగా ఏడాదిన్నర పాటు ఈ చట్టాలను నిలిపివేసేందుకు అంగీకరించిందని రైతు సంఘాల నేతలు తెలిపారు. దీంతో ఈనెల 22న జరగబోయే 11వ విడత చర్చల్లో అయినా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా..? లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.

అయితే కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు వ్యవసాయ ప్రయోజనాల కోసమేనని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. మంచి చర్యలు తీసుకున్నప్పుడల్లా అడ్డంకులు అనేవి వస్తాయని, రైతు నాయకులు తమదైన రీతిలో పరిష్కారం కోరుకుంటున్నందున సమస్యను పరిష్కరించేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుందని కేంద్రం పేర్కొంది. అయితే ఏడాదిన్నర పాటు చట్టాలను నిలిపివేసేందుకు అంగీకరించిన కేంద్రం.. ఈలోగా పరస్పర సంప్రదింపులతో సంక్షోభం పరిష్కరమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రైతు సంఘాల ఆందోళన గురువారం నాటికి 57 రోజులకు చేరుకుంది. ఇక శుక్రవారం ముగ్గురు కేంద్ర మంత్రులు అన్నదాతలతో సంప్రదింపులు జరపనున్నారు.

Also Read: Farmers Protest : రైతు సమస్యలపై మెట్టుదిగిన కేంద్రం.. రేపటి చర్చల్లో పూర్తి క్లారిటీకి ఛాన్స్‌