ఎస్‌బీఐకి రూ. 2 కోట్ల జరిమానా విధించిన ఆర్బీఐ.. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టంలోని నిబంధనల ఉల్లంఘనే కారణం

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ)కి రిజర్వుబ్యాంక్‌ గట్టి షాకిచ్చింది. నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడినందుకుగాను బ్యాంక్‌పై రూ.2 కోట్ల జరిమానా విధించింది ఆర్బీఐ...

ఎస్‌బీఐకి రూ. 2 కోట్ల జరిమానా విధించిన ఆర్బీఐ.. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టంలోని నిబంధనల ఉల్లంఘనే కారణం
Follow us

|

Updated on: Mar 17, 2021 | 8:00 AM

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ)కి రిజర్వుబ్యాంక్‌ గట్టి షాకిచ్చింది. నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడినందుకుగాను బ్యాంక్‌పై రూ.2 కోట్ల జరిమానా విధించింది ఆర్బీఐ. బ్యాంకింగ్‌ రెగ్యులేటరీ యాక్ట్‌ 1949 చట్టం ప్రకారం సంస్థ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలడంతో ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ పేర్కొంది.  సంస్థ ఆర్థిక లాావాదేవీలకు సంబంధించి పలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలడంతో ఈ జరిమానా విధించింది. తమ నిబంధనలు ఎస్‌బీఐ ఉల్లంఘించిందని ఆర్బీఐ తెలిపింది. కమీషన్‌ రూపంలో బ్యాంకులు తమ ఉద్యోగులకు వేతనం ఇవ్వవద్దని ఆర్‌బీఐ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నట్లు ఈ సందర్భంగా ఆర్బీఐ గుర్తు చేసింది.

బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టంలోని కొన్ని నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు కమిషన్‌ రూపంలో ఉద్యోగులకు వేతనం చెల్లించడంతో ఆర్బీఐ ఆదేశాలను ఎస్‌బీఐ బేఖాతర్‌ చేసినట్లయిందని పేర్కొంది. ఈ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించినట్లు స్పష్టం చేసింది. ఆర్‌బీఐ చర్యలు పూర్తిగా నిబంధనలకు లోబడే ఉన్నాయి ఆర్బీఐ వెల్లడించింది. అయితే ఎలాంటి ఇతర ఉద్దేశాలు లేవని తెలిపింది. కాగా, ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 31 2017, మార్చి 31 2018 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకు ఆర్థిక స్థితిగతులపై తనిఖీ చేసిన తమకు తమకు ఉద్యోగుల వేతనాలు కమిషన్‌ రూపంలో చెల్లించినట్లు తేలిందని ఆర్‌బీఐ వెల్లడించింది. దీంతో అప్పట్లోనే బ్యాంకకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని తెలిపింది. బ్యాంకు వివరణ చూసిన తర్వాతే జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ పేర్కొంది.

ఇవీ చదవండి :

పదివేలతో ఈ వ్యాపారం ప్రారంభించండి.. నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించండి.. సింపుల్ బిజినెస్..

Credit Card : ఓ మై గాడ్.. క్రెడిట్ కార్డు వాడకం.. కొకైన్‌కి బానిసవ్వడం ఒక్కటేనట.. షాకింగ్ నిజాలు వెల్లడిస్తున్న..

క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. ఇకపై కార్డులు పొందడం అంత ఈజీ కాదంటున్న బ్యాంకులు..!

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.