Sasikala Released: ఇవాళ జైలు నుంచి విడుదల కానున్న శశికళ.. స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు..!

Sasikala Released: అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళ విడుదల కానుంది. బుధవారం ఉదయం 10.30 గంటలకు చిన్నమ్మ ...

Sasikala Released: ఇవాళ జైలు నుంచి విడుదల కానున్న శశికళ.. స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు..!
Follow us

|

Updated on: Jan 27, 2021 | 12:42 AM

Sasikala Released: అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళ విడుదల కానుంది. బుధవారం ఉదయం 10.30 గంటలకు చిన్నమ్మ జైలు నుంచి విడుదల కానున్నారు. కరోనాతో విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శశికళ.. ఇవాళ ఉదయం 9 గంటలకు విడుదలకు సంబంధించి పత్రాలపై సంతాకాలు తీసుకోనున్నారు జైలు అధికారులు. అయితే పూర్తిగా కోలుకున్న తర్వాతే చెన్నైకి బయలుదేరనున్నారు.

హెల్త్‌ బులిటెన్‌ విడుదల

బెంగళూరులో చికిత్స పొందుతున్న శశికళ హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశారు ఆస్పత్రి వైద్యులు. చిన్నమ్మ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. నిపుణుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. సాధారణస్థితిలో బీపీ, ఆక్సిజన్‌ లెవెల్స్‌ చేరుకున్నట్లు విక్టోరియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

ఇక శిశికళ అస్వస్థతకు గురి కావడంతో అభిమానులు, నేతలు, మద్దతుదారులు ఒకింత ఆందోళకు గురయ్యారు. ఆమె జైలు నుంచి విడుదల కాగానే భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పరప్పణ అగ్రహారం జైలు నుంచి చెన్నై వరకు కనీసం వెయ్యి వాహనాలతో స్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్‌ మున్నేట్రకళగం అధినేత దినకరన్‌ బృందం ఏర్పాట్లు చేపట్టినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర రాజకీయాల్లో మార్పు చోటు చేసుకోనుందా..?

శశికళ జైలు నుంచి బయటకు రాగానే రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. అయితే చిన్నమ్మ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారా..? లేదా అనేదానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ఒక కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవించిన వారు ప్రత్యక్ష ఎన్నికల్లో నాలుగేళ్ల పాటు పోటీ చేసేందుకు అనర్హులు. దీంతో ఆమె ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. శశికళ జైలు నుంచి విడుదలయ్యాక అనుకున్నది సాధించేందుకు పట్టు బిగించినట్లు తెలుస్తోంది. అలాగే తన పంతాన్ని నెగ్గించుకునేందుకు శశికళ తిరిగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఏకంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో జట్టుకట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి చిన్నమ్మ విడుదలయ్యాక ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.