సంజయ్ భన్సాలీ ‘మోదీ’ బయోపిక్ తెలుగు వెర్షన్ ‘మనోవిరాగి’

భారత ప్రధాని న‌రేంద్ర మోదీ జీవిత కథను ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తెలుగువెర్షన్ 'మనోవిరాగి' పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు.

  • Anil kumar poka
  • Publish Date - 2:16 pm, Thu, 17 September 20
సంజయ్ భన్సాలీ 'మోదీ' బయోపిక్ తెలుగు వెర్షన్ 'మనోవిరాగి'

భారత ప్రధాని న‌రేంద్ర మోదీ జీవిత కథను ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తెలుగువెర్షన్ ‘మనోవిరాగి’ పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ లుక్ విడుదలైంది. ఇప్పటికే న‌రేంద్ర మోదీ జీవిత కథతో ఓ బయోపిక్ రిలీజైన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ, మహవీర్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి సంజ‌య్ త్రిపాఠి ద‌ర్శక‌త్వం. ఒక సాధారణ కుర్రాడి నుంచి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఎదిగిన తీరును ఈ సినిమాలో చూపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పూర్తి కావాల్సిఉన్నా కరోనా నేపథ్యంలో ఆలస్యమైంది.