సంజయ్ దత్ కి నెగెటివ్, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

సంజయ్ దత్ కి నెగెటివ్, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సోమవారం ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు కరోనా టెస్ట్ లో నెగెటివ్ వచ్చిందని ఆసుపత్రి వర్గాలు..

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Aug 10, 2020 | 4:59 PM

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సోమవారం ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు కరోనా టెస్ట్ లో నెగెటివ్ వచ్చిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. శ్వాశ సంబంధ సమస్యలు తలెత్తడంతో ఆయన ఈ నెల 8 న హాస్పిటల్ లో చేరారు. ఆస్పత్రి లోని నాన్-కోవిడ్ వార్డులో అబ్జర్వేషన్ లో ఉన్న సంజయ్ దత్ కి నెగెటివ్ రిపోర్టు వచ్చిన దృష్ట్యా డిశ్చార్జి చేసినట్టు ఈవర్గాలు వెల్లడించాయి. సోషల్ మీడియా ద్వారా  అభిమానులకు తన ఆరోగ్యం గురించి అప్ డేట్ ఇచ్చిన ఆయన.. ప్రస్తుతం మెడికల్ అబ్జర్వేషన్ లో ఉన్న తాను ఆరోగ్యంగానే ఉన్నానని, కోవిడ్-19 రిపోర్టులో తనకు నెగెటివ్ వచ్చిందని పేర్కొన్నారు. హాస్పిటల్ డాక్టర్లు, నర్సులు, ఇతర స్టాఫ్ అందించిన సేవలు, వారి తోడ్పాటుతో నా ఆరోగ్యం మెరుగైంది అని సంజయ్ దత్ వివరించారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu