S-400: చైనా..పాక్ లకు చెక్ పెట్టే రక్షణ వ్యవస్థ రెడీ.. పంజాబ్‌లో అత్యంత ఆధునాతన ఎస్-400 మోహరింపు!

S-400: చైనా..పాక్ లకు చెక్ పెట్టే రక్షణ వ్యవస్థ రెడీ.. పంజాబ్‌లో అత్యంత ఆధునాతన ఎస్-400 మోహరింపు!
S 400 Missile

రష్యాలో తయారయిన శక్తివంతమైన వైమానిక రక్షణ వ్యవస్థ S-400 విస్తరణకు భారత్ సన్నాహాలు ప్రారంభించింది. భారత వైమానిక దళం వచ్చే నెలలో పంజాబ్‌లోని ఎయిర్‌బేస్‌లో ప్రపంచంలోని అత్యంత అధునాతన వాయు రక్షణ వ్యవస్థ మొదటి బ్యాచ్‌లో అందుబాటులోకి వచ్చిన వ్యవస్థను మోహరించనుంది.

KVD Varma

|

Jan 02, 2022 | 8:34 AM

S-400: రష్యాలో తయారయిన శక్తివంతమైన వైమానిక రక్షణ వ్యవస్థ S-400 విస్తరణకు భారత్ సన్నాహాలు ప్రారంభించింది. భారత వైమానిక దళం వచ్చే నెలలో పంజాబ్‌లోని ఎయిర్‌బేస్‌లో ప్రపంచంలోని అత్యంత అధునాతన వాయు రక్షణ వ్యవస్థ మొదటి బ్యాచ్‌లో అందుబాటులోకి వచ్చిన వ్యవస్థను మోహరించనుంది. దీని సహాయంతో ఇక్కడ నుంచి చైనా.. పాకిస్తాన్ సరిహద్దులో ఎటువంటి దుర్మార్గపు ప్రయత్నాన్నైనా విఫలం చేసే అవకాశం మన సైన్యానికి చిక్కుతుంది. ఈ క్షిపణి వ్యవస్థను మోహరించే ప్రక్రియను ప్రారంభించినట్లు సైనిక అధికారులు శనివారం సమాచారం ఇచ్చారు. ఇది పూర్తి కావడానికి కనీసం మరో ఆరు వారాలు పడుతుంది. క్షిపణి వ్యవస్థ మొదటి రెజిమెంట్ ఉత్తర సెక్టార్‌లోని చైనా సరిహద్దులోని భాగాలను అలాగే పాకిస్తాన్ సరిహద్దులను కవర్ చేసే విధంగా మోహరిస్తున్నారు.

ప్రపంచంలోని అత్యాధునిక రక్షణ వ్యవస్థ

S-400, ప్రపంచంలోనే అత్యంత ఆధునిక వైమానిక రక్షణ వ్యవస్థగా పరిగనిస్తున్నారు. ఇది గాలిలో భారతదేశ శక్తిని అభేద్యంగా చేస్తుంది. ఈ వ్యవస్థ శత్రు క్షిపణులు, డ్రోన్లు.. విమానాలను 400 కిలోమీటర్ల పరిధిలో దాడి చేయడం ద్వారా గాలిలో నాశనం చేయగలదు. ఇందులో సూపర్‌సోనిక్ .. హైపర్‌సోనిక్ సహా 4 రకాల క్షిపణులు ఉన్నాయి. 400 కి.మీ వరకు లక్ష్యాలను చేధించడంలో ఇవి సరైనవి. ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతన రక్షణ వ్యవస్థగా పరిగణిస్తారు.

ఈ వ్యవస్థ ప్రత్యేకత ఏమిటి?

S-400 అతిపెద్ద ఫీచర్ దాని మొబిలిటీ.. అంటే దీనిని రోడ్డు ద్వారా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఇది 92N6E ఎలక్ట్రానిక్‌గా స్టీర్డ్ ఫేజ్‌డ్ యారో రాడార్‌తో అమర్చి ఉంటుంది. ఇది దాదాపు 600 కిలోమీటర్ల దూరం నుంచి బహుళ లక్ష్యాలను గుర్తించగలదు. ఆదేశాలను స్వీకరించిన 5 నుంచి 10 నిమిషాల్లో ఇది ఆపరేషన్‌కు సిద్ధంగా ఉంటుంది. S-400 ఒక యూనిట్ ఏకకాలంలో 160 వస్తువులను ట్రాక్ చేయగలదు. ఒకే లక్ష్యం కోసం 2 క్షిపణులను ప్రయోగించవచ్చు. S-400లోని 400 ఈ వ్యవస్థ పరిధిని సూచిస్తుంది. భారతదేశం పొందుతున్న వ్యవస్థ 400 కి.మీ. అంటే 400 కి.మీ దూరంలో ఉన్న తన లక్ష్యాన్ని గుర్తించడం ద్వారా దాడిని ఎదుర్కోగలదు. అలాగే, ఇది 30 కి.మీ ఎత్తులో కూడా తన లక్ష్యాన్ని దాడి చేయగలదు.

నిఘా రాడార్‌తో శత్రు క్షిపణులను తక్షణమే గుర్తించడం ఈ రక్షణ వ్యవస్థలో నిఘా రాడార్ ఉంది. ఇది దాని కార్యాచరణ ప్రాంతం చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పరుస్తుంది. క్షిపణి లేదా ఇతర ఆయుధం ఈ సర్కిల్‌లోకి ప్రవేశించిన వెంటనే.. రాడార్ దానిని గుర్తించి కమాండ్ వాహనానికి హెచ్చరికను పంపుతుంది. హెచ్చరిక అందిన వెంటనే, గైడెన్స్ రాడార్ లక్ష్యం స్థానాన్ని గుర్తించి, ఎదురుదాడి కోసం క్షిపణిని ప్రయోగిస్తుంది.

అందుతున్న సమాచారం ప్రకారం, 2018-19లో S-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు కోసం భారతదేశం .. రష్యా మధ్య ఒప్పందం కుదిరింది. దీని కింద 5 బిలియన్ల (సుమారు 35 వేల కోట్లు) మొత్తంతో 5 రెజిమెంట్లను కొనుగోలు చేస్తారు. మొదటి రెజిమెంట్ డిసెంబర్ 2020లో భారతదేశానికి చేరుకుంది. దీని భాగాలు వాయు, సముద్ర మార్గాల ద్వారా దేశానికి చేరుకున్నాయి. పంజాబ్‌లో ఒక రెజిమెంట్‌ను మోహరించడంతో, ఉత్తర సెక్టార్‌లోని చైనా.. పాకిస్తాన్ సరిహద్దులో ప్రతి కదలికను పర్యవేక్షించే అవకాశం దొరుకుతుంది. అదే సమయంలో, పంజాబ్ తర్వాత, ఈ రక్షణ వ్యవస్థ తూర్పు ఫ్రంట్‌ను బలోపేతం చేస్తుంది.

మొత్తం డీల్ విలువ 40 వేల కోట్లు..

ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ.. అంటే గగనతలంలో జరిగే దాడులను అడ్డుకుంటుంది. శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, రాకెట్ లాంచర్లు, ఫైటర్ జెట్‌ల దాడిని నిరోధించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది. ఇది రష్యా అల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరోచే రూపొందింది. ప్రపంచంలోని అత్యంత అధునాతన వాయు రక్షణ వ్యవస్థలలో ఒకటిగా ఈ వ్యవస్థను పరిగణిస్తారు. 2018లో, S-400 5 యూనిట్ల కోసం భారతదేశం .. రష్యా మధ్య సుమారు 40 వేల కోట్ల రూపాయల ఒప్పందం కుదిరింది.

ఇవి కూడా చదవండి: Corona Vaccination: 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. మొదటి రోజు ఎంతమంది నమోదు చేసుకున్నారో తెలుసా?

New Year Horoscope: కొత్త సంవత్సరంలో మీ ఆరోగ్య..ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలని ఉందా? మరెందుకాలస్యం..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu