వరదల ఎఫెక్ట్‌.. నివాస ప్రాంతాల్లోకి ఖడ్గమృగాలు

అసోంలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వంద మందికి పైగా ప్రాణాలు విడిచారు. సామన్య ప్రజలే కాదు.. పశువులు కూడా పెద్ద ఎత్తున..

వరదల ఎఫెక్ట్‌.. నివాస ప్రాంతాల్లోకి ఖడ్గమృగాలు
Follow us

| Edited By:

Updated on: Jul 29, 2020 | 7:48 PM

అసోంలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వంద మందికి పైగా ప్రాణాలు విడిచారు. సామన్య ప్రజలే కాదు.. పశువులు కూడా పెద్ద ఎత్తున మరణించాయి. పార్కుల్లో ఉన్న వన్యప్రాణులు కూడా ప్రాణాలు కోల్పోయాయి. అయితే కొన్ని జంతువులు మాత్రం వరద ముంపు నుంచి తప్పించుకుని రహదారుల వెంట తిరుగుతున్నాయి. తాజాగా.. పొబితోర వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో భారీగా వరదనీరు చేరింది. దీంతో అందులో ఉన్న ఖడ్గ మృగాలు అటవీ సమీపంలో ఉన్న గ్రామాల్లోకి వెళ్లాయి. ఇక ఇప్పటికే కజిరంగా నేషనల్ పార్క్‌లో వరదల కారణంగా 132 ప్రాణులు కోల్పోయినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో 30 జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. దీంతో 56,71,018 మంది వరదబారిన పడ్డారు. 5,305 గ్రామాలు వరద నీటిలో మునిగి పోవడంతో.. వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Read More 

భారత్ ఒడిలోకి చేరుకున్న రాఫెల్.. రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎమన్నారంటే..?