అయోధ్యలో మసీదు నిర్మాణానికి సంబంధించిన ఫొటోలు విడుదల.. ఇవి ఏ విధంగా సెలెక్ట్ చేశారంటే..

దశాబ్ధాల తరబడి సాగిన అయోధ్య రామమందిరం, బాబ్రీ మసీద్ వివాదానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో ఎండ్ కార్డ్ పడిన

అయోధ్యలో మసీదు నిర్మాణానికి సంబంధించిన ఫొటోలు విడుదల.. ఇవి ఏ విధంగా సెలెక్ట్ చేశారంటే..
Follow us

|

Updated on: Dec 20, 2020 | 5:41 AM

దశాబ్ధాల తరబడి సాగిన అయోధ్య రామమందిరం, బాబ్రీ మసీద్ వివాదానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో ఎండ్ కార్డ్ పడిన దరిమిలా అయోధ్యలో బాబ్రీ మసీద్‌కు బదులుగా మరో మసీద్ నిర్మాణానికి పునాది రాయి పడనుంది. మసీదు నిర్మాణానికి శంకుస్థాపన ముహూర్తంగా జనవరి 26 అంటే భారత ఘనతంత్ర దినోత్సవం రోజును ఫిక్స్ చేశారు. సున్నీ వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసిన ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఈ విషయాన్ని ప్రకటించింది. అలాగే ఈ నిర్మాణానికి సంబంధించి బ్లూ ప్రింట్‌ను కూడా విడుదల చేశారు.

అయోధ్యలోని దన్నీపూర్‌ గ్రామంలో మసీదు కోసం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఈ స్థలంలో మసీదు నిర్మాణాన్ని చేపడుతున్నారు. కాగా, అయోధ్య మసీదు కాంప్లెక్స్‌లో మసీదుతో పాటు 300 పడకల సామర్థ్యం గల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, లైబ్రరీ, కమ్యూనిటీ కిచెన్ ఉండబోతున్నాయని ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు. ఇక బాబ్రీ మసీదు కంటే పెద్దగా.. ఏకకాలంలో 2వేల మంది నమాజ్ చేసుకునే వీలుగా దీని నిర్మాణం ఉంటుందన్నారు. అయితే ఇప్పుడు మసీదు, ఆస్పత్రి, గ్రంథాలయం నిర్మాణానికి సంబంధించిన ఫోటోలు విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు మసీదుల డిజైన్లను పరిశీలించిన అనంతరం ఈ డిజైన్‌ను ఖారరు చేసినట్టు ఇండో ఇస్లామిక కల్చరల్ ఫౌండేషన్ తెలిపింది.