ఆ రైల్వే నోటిఫికేష‌న్ ఫేక్.. గరంగ‌రం అయిన రైల్వే శాఖ‌

ఆ రైల్వే నోటిఫికేష‌న్ ఫేక్.. గరంగ‌రం అయిన రైల్వే శాఖ‌

భార‌తీయ రైల్వేలోని వివిధ విభాగ‌ల్లో 5,285 పోస్టుల భ‌ర్తీ అంటూ ఇటీవ‌లే ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో అభ్య‌ర్థులంద‌రూ ఆ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు రెడీ అయ్యారు. అయితే ఆ నోటిఫికేష‌న్ న‌కిలీద‌ని భార‌త‌ రైల్వేశాఖ..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 10, 2020 | 3:21 PM

భార‌తీయ రైల్వేలోని వివిధ విభాగ‌ల్లో 5,285 పోస్టుల భ‌ర్తీ అంటూ ఇటీవ‌లే ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో అభ్య‌ర్థులంద‌రూ ఆ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు రెడీ అయ్యారు. అయితే ఆ నోటిఫికేష‌న్ న‌కిలీద‌ని భార‌త‌ రైల్వేశాఖ వెల్ల‌డించింది. ఓ ప్రైవేట్ ఏజెన్సీ ఈ పోస్టుల భ‌ర్తీని విడుద‌ల చేసిందట‌. ఈ మేర‌కు ఓ ట్వీట్ చేసింది రైల్వే శాఖ‌.

ఆ ట్వీట్‌లో నోటిఫికేష‌న్‌కు సంబంధించిన వార్త‌లు ఫేక్ అంటూ ఉన్న ఫొటోల‌ను జ‌త ప‌రుస్తూ.. ఇలాంటి తప్పుడు వార్త‌ల‌ను అభ్య‌ర్థులు న‌మ్మ‌కూడ‌ద‌ని సూచించింది. ”రైల్వేలో ఐదు వేల‌కు పైగా పోలీస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని, ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని అవెస్ట్ర‌న్ ఇన్ఫోటెక్ అనే సంస్థ నోటిఫికేష‌న్‌ను ప్ర‌చురించింది”. దీనిపై స్పందించిన రైల్వే శాఖ‌ అది అబ‌ద్ద‌మ‌ని, త‌మ విభాగాల్లో ఉద్యోగ‌ల భార్తీకి సంబంధించి ఎలాంటి ప్రైవేట్ కంపెనీకి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌లేద‌ని తెలుపుతూ ట్వీట్‌లో పేర్కొంది.

ఏదైనా నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తే తాము బ‌హిరంగంగా ప్ర‌క‌టిస్తామ‌ని, విస్తృత ప్ర‌చారం చేస్తామ‌ని, ప్రముఖ జాతీయ‌, ప్రాంతీయ‌ దిన‌ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌ట‌న‌లు ఇస్తామ‌ని వెల్ల‌డించింది. అలాగే నోటిఫికేష‌న్ల‌కు సంబంధించిన వివ‌రాల కోసం ఎల్ల‌ప్పుడూ అధికారిక వెబ్‌సైటులోనే చూడాల‌ని, ప్రైవేట్ సైట్ల‌లో వ‌చ్చే స‌మాచారాన్ని న‌మ్మ‌కూడ‌ద‌ని హెచ్చ‌రింది.

Read More: 

మాజీ రెజ్ల‌ర్ జేమ్స్ హారిస్ క‌న్నుమూత‌..

జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ప్ర‌ధాన‌ అనుచ‌రుడు మృతి

14 ఏళ్ల త‌ర్వాత దొరికిన ప‌ర్సు.. అవాక్క‌యిన వ్య‌క్తి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu