మరో మూడు నెలల పాటు ‘వాయిదా’ పొడిగించనున్న ఆర్బీఐ..!

మరో మూడు నెలల పాటు 'వాయిదా' పొడిగించనున్న ఆర్బీఐ..!

కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ను మళ్లీ పొడిగించిన నేపథ్యంలో రుణాల వాయిదాలపై విధించిన మారటోరియంను కూడా మరో 3 నెలలు పొడిగించాలని

TV9 Telugu Digital Desk

| Edited By:

May 05, 2020 | 6:29 AM

కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ను మళ్లీ పొడిగించిన నేపథ్యంలో రుణాల వాయిదాలపై విధించిన మారటోరియంను కూడా మరో 3 నెలలు పొడిగించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) భావిస్తున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ కొనసాగింపు కారణంగా ఇటు వ్యక్తులు, అటు సంస్థలకు ఆదాయాలొచ్చే మార్గాలు లేనందున మారటోరియంను పొడిగించాలంటూ ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ సహా వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో ఆ విఙ్ఞప్తులపై ఆర్‌బీఐ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా కరోనా లాక్‌డౌన్‌ మొదలైన సమయంలో మూడు నెలల పాటు వాయిదాల చెల్లింపులపై మారటోరియం విధిస్తూ మార్చి 27న ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. దీని గడువు ఈ నెల31తో ముగియనుంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో మారటోరియంను పొడిగించడమే మంచిదని ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్‌ అధికారి తెలిపారు. కష్టకాలంలో ఇటు రుణగ్రహీతలకు, అటు బ్యాంకులకు ఇది ఊరట ఇవ్వగలదని ఆయన అన్నారు.

Read This Story Also: ప‌వ‌న్ తో స్క్రీన్ పంచుకోబోతున్న అనుష్క‌..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu