రామ మందిర నిర్మాణం కోసం విరాళాలిచ్చే వారికి కేంద్రం గుడ్‌న్యూస్..!

రామ మందిర నిర్మాణం కోసం విరాళాలిచ్చే వారికి కేంద్రం గుడ్‌న్యూస్..!

రామ మందిర నిర్మాణం కోసం విరాళాలిచ్చే వారికి మోదీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. అయోధ్యలో శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్రం నిర్మాణ పనుల్లో భాగంగా.. ఇప్పటికే శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే అనేక మంది ఈ ట్రస్టుకు విరాళాలు అందజేశారు. పలు పెద్ద పెద్ద కంపెనీలు కూడా రామ మందిర నిర్మాణంలో భాగంగా ట్రస్టుకు విరాళాలను అందచేశాయి. అయితే ఈ ట్రస్టుకు విరాళాలు పంపిన వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త […]

TV9 Telugu Digital Desk

| Edited By:

May 09, 2020 | 12:18 PM

రామ మందిర నిర్మాణం కోసం విరాళాలిచ్చే వారికి మోదీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. అయోధ్యలో శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్రం నిర్మాణ పనుల్లో భాగంగా.. ఇప్పటికే శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే అనేక మంది ఈ ట్రస్టుకు విరాళాలు అందజేశారు. పలు పెద్ద పెద్ద కంపెనీలు కూడా రామ మందిర నిర్మాణంలో భాగంగా ట్రస్టుకు విరాళాలను అందచేశాయి. అయితే ఈ ట్రస్టుకు విరాళాలు పంపిన వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. దాతలు ఇచ్చే విరాళాలపై సెక్షన్ 80 జి కింద ఆదాయపు పన్ను రాయితీ ఇవ్వనుంది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆధీనంంలోని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. శ్రీ రామజన్మభూమి అయిన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఇచ్చే విరాళాలపై.. ఆదాయపు పన్ను రాయితీ ఇస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. 2020-21 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మందిర నిర్మాణానాకి ఇచ్చిన విరాళాలకు ఐటీ నుంచి మినహాయిస్తామని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ పేర్కొంది.

కాగా.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం.. కేంద్ర ప్రభుత్వం 15 మంది సభ్యులతో కూడిన ట్రస్టు బోర్డును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రస్టుకు అధ్యక్షుడిగా నిత్య గోపాల్ దాస్‌ని నియమించారు. ఇక ప్రధాన కార్యదర్శిగా విశ్వ హిందూ పరిషత్‌కు చెందిన కీలక నేత.. చంపత్‌రాయ్‌ని నియమించారు. ఇక స్వామి గోవింద్ దేవ్ గిరి కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టుకు సంబంధించిన అధికారిక లోగోను కూడా ఇటీవల విడుదల చేశారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu