కోవిడ్ భయం, రాజస్తాన్ హైకోర్టు మూడు రోజులు మూసివేత

రాజస్థాన్ హైకోర్టును సోమవారం నుంచి మూడు రోజులపాటు మూసివేయనున్నారు. జైపూర్ లోని ఈ బ్రాంచ్ కోర్టు ఉద్యోగులందరికీ కరోనా వైరస్ టెస్టులు నిర్వహించాలని రిజిస్ట్రార్..

  • Umakanth Rao
  • Publish Date - 8:17 pm, Sun, 16 August 20
కోవిడ్ భయం, రాజస్తాన్ హైకోర్టు మూడు రోజులు మూసివేత

రాజస్థాన్ హైకోర్టును సోమవారం నుంచి మూడు రోజులపాటు మూసివేయనున్నారు. జైపూర్ లోని ఈ బ్రాంచ్ కోర్టు ఉద్యోగులందరికీ కరోనా వైరస్ టెస్టులు నిర్వహించాలని రిజిస్ట్రార్ జనరల్ సూచించారు. ఈ మేరకు నోటీసు జారీ అయింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంద్రజిత్ మహంతికి కరోనా వైరస్ పాజిటివ్ అని మొదటి టెస్ట్ లో రాగా, రెండో టెస్ట్ లో నెగెటివ్ అని వచ్చింది. రాజస్తాన్ లో ఇప్పటివరకు 60 వేల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వీటిలో సుమారు 14 వేలు యాక్టివ్ కేసులు.. అటు-860 మంది కరోనా రోగులు మృతి చెందారు.