రాజస్థాన్ అసెంబ్లీలో వచ్చేవారం అశోక్ గెహ్లాట్ బలపరీక్ష ?

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వచ్చేవారం అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోవచ్చు.. శనివారం సాయంత్రం ఆయన గవర్నర్ కల్ రాజ్ మిశ్రాతో సమావేశమై ఇందుకు తన సంసిధ్ధతను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తన..

  • Umakanth Rao
  • Publish Date - 10:47 am, Sun, 19 July 20
రాజస్థాన్ అసెంబ్లీలో వచ్చేవారం  అశోక్ గెహ్లాట్ బలపరీక్ష ?

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వచ్చేవారం అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోవచ్చు.. శనివారం సాయంత్రం ఆయన గవర్నర్ కల్ రాజ్ మిశ్రాతో సమావేశమై ఇందుకు తన సంసిధ్ధతను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తన ప్రభుత్వానికి మద్దతు ప్రకటించగానే ఆయన గవర్నర్ తో భేటీ అయ్యారు. వచ్ఛేవారం శాసన సభను సమావేశపరచాలని ఆయన కోరినట్టు సమాచారం. అయితే మంగళవారం తరువాతే సభ సమావేశం కావచ్ఛునని అంటున్నారు. తనను, తన వర్గంలోని 18 మంది ఎమ్మెల్యేలను సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటిస్తూ,, స్పీకర్ పంపిన నోటీసును సవాలు చేస్తూ సచిన్ పైలట్ రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కోర్టు ఆ రోజున విచారించనుంది. మరోవైపు గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో కలిసి కుట్ర పన్నారన్న ఆరోపణలపై భన్వర్ లాల్ శర్మ, విశ్వేన్ద్ర సింగ్ అనే ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది.