Earthquake: రెండో రోజు మళ్లీ భూకంపం.. వణికిపోతున్న ప్రజలు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు

Earthquake: రాజస్థాన్ రాష్ట్రంలో పలు చోట్ల భారీ భూకంపం సంభవించింది. నిన్న తెల్లవారుజామున 5.24 గంటలకు రాజస్థాన్‌లోని బికానెర్‌తో పాటు.. ఇతర ప్రాంతాల్లో భూమి..

Earthquake: రెండో రోజు మళ్లీ భూకంపం.. వణికిపోతున్న ప్రజలు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
Follow us

|

Updated on: Jul 22, 2021 | 10:26 AM

Earthquake: రాజస్థాన్ రాష్ట్రంలో పలు చోట్ల భారీ భూకంపం సంభవించింది. నిన్న తెల్లవారుజామున 5.24 గంటలకు రాజస్థాన్‌లోని బికానెర్‌తో పాటు.. ఇతర ప్రాంతాల్లో భూమి కంపించగా, తాజాగా గురువారం కూడా భూకంపం సంభవించింది. ఈ రోజు ఉదయం బికానెర్‌ ప్రాంతంలో మరోమారు భూప్రకంపనలు సంభవించడం భయాందోళనకు గురి చేస్తోంది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.8గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. పెద్ద శబ్దాలతో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇలా ఒక రోజు తర్వాత ఒకరు రెండు సార్లు భూకంపాలు రావడంతో మరింత భయాందోళన నెలకొంది.

కాగా, ఈ మధ్య కాలంలో భూకంపాలు చాలా ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ఇటీవల కాలంలో కూడా ఢిల్లీ, పంజాబ్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో భూకంపాలు చోటు చేసుకున్నాయి. అయితే ఇతర దేశాల్లో వచ్చే భూకంపాలతో పెద్ద ఎత్తున నష్టం ఉండగా, మన దేశంలో సంభవించే భూకంపాల వల్ల ప్రాణ, ఆస్తినష్టం ఉండటం లేదు. అయినా వరుస భూకంపాలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే నమోదైన భూకంపాల వల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

భూకంపం వచ్చిందంటే చాలు వణికిపోవాల్సిందే

అయితే భూకంపం వచ్చిందంటే చాలు అందరూ వణికిపోవాల్సిందే. ప్రకృతి కన్ను తెరిచి విలయతాండవం చేస్తుంది. భూకంప ధాటికి క్షణాల్లోనే అల్లకల్లోలం అయిపోతుంది. అసలు భూకంపం ఎందుకు వస్తుంది..? అందుకు కారణాలు లేకపోలేదు. కానీ సమాజంలో మాత్రం భూకంపాల మీద రకరకాల కట్టుకథలున్నా.. కథలుగానే మిగిలిపోయాయి. భూకంపాలు రావడానికి శాస్త్రపరమైన కారణాలే కాక పర్యావరణానికి జరుగుతున్న అపార నష్టం కూడా చాలా కారణాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెద్ద రిజర్వాయర్లలో నిల్వ ఉంచిన నీటి వల్ల, అపారమైన భూగర్భ జలాన్ని ఎక్కువ దుర్వినియోగం చేయడం ద్వారా, అలాగే చెట్లను నరకడం వంటివి జరుగుతుండటంతో భూకంపాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. రిజర్వాయర్లలో ఉన్న వందలాది ఘనపు మైళ్ల నీటి ఒత్తిడి భూమిపై పడటం వల్ల భూగర్భంలో మార్పులు జరిగి భూమి కంపిస్తుంది. భూమి చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్న సమయంలో భూమి అంతర్గత పొరల్లో సర్దుబాట్ల ఫలితమే ఈ ప్రకంపనలు జరగడానికి కారణమని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. భూప్రకంపనల తీవ్రతను బట్టి నష్టం వాటిల్లుతోంది.

ఇవీ కూాడా చదవండి:

JioFiber: రిలయన్స్‌ జియో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌.. కేవలం 199 రూపాయలకే 1000జీబీ డేటా..!

Modi Government: సీనియర్‌ సిటిజన్స్‌కు శుభవార్త.. వారందరికీ రూ.10 వేలు.. కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం..?

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..