RAHUL VERSUS PRIYANKA: రాహుల్, ప్రియాంక.. మధ్యలో ప్రశాంత్ కిశోర్ అవుట్.. కాంగ్రెస్ పార్టీలో అన్నచెల్లెళ్ళ ఆధిపత్య పోరు.. అసలేం జరిగిందంటే?

పీకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇప్పట్లో తిరిగి రావడం లేదని క్లారిటీ వచ్చింది. అయితే ఇక్కడే కొన్ని మిలియన్ డాలర్ల ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. అదే కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనమే అనే స్థాయి నుంచి ఒక్కసారిగా తిరస్కారం దాకా పరిస్థితి ఎలా వచ్చింది ?

RAHUL VERSUS PRIYANKA: రాహుల్, ప్రియాంక.. మధ్యలో ప్రశాంత్ కిశోర్ అవుట్.. కాంగ్రెస్ పార్టీలో అన్నచెల్లెళ్ళ ఆధిపత్య పోరు.. అసలేం జరిగిందంటే?
Gandhi Problem
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 28, 2022 | 8:43 PM

RAHUL VERSUS PRIYANKA BIG CHECK TO PRASHANT KISHORE:  ప్రశాంత్ కిశోర్.. గత వారమంతా మీడియాలో తెగనానిన పేరు. ఏ క్షణమైనా కాంగ్రెస్ పార్టీ CONGRESS PARTYలో చేరతారంటూ తెగ ప్రచారం జరిగింది. వారంలో మూడుసార్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ SONIA GANDHI ని కల్వడంతో ఆయన చేరిక ఇక లాంఛనమే అనే స్థాయిలో వార్తలొచ్చాయి. అటు కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతూనే ఇటు హైదరాబాద్ వచ్చి టీఆర్ఎస్ (TRS) పార్టీ అధినేత కే.చంద్రశేఖర్ రావు K CHANDRA SHEKHAR RAOతోను ప్రశాంత్ కిశోర్ సుదీర్ఘ మంతనాలు జరిపారు. రెండు రోజుల పాటు పదేసి గంటలు వీరిద్దరు చర్చలు జరపడంతో అసలు పీకే ప్లాన్ ఏంటి అనే అంశం అందరిలోను ఆసక్తి రేపింది. కొన్ని మీడియా సంస్థలైతే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేందుకు పీకే రంగంలోకి దిగారని పేర్కొంటూ దానికి ఓ నాలుగైదు లాజిక్కులు కూడా జత చేశాయి. చివరికి ఏప్రిల్ 26న పీకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని కుండబద్దలు కొట్టారు. పార్టీలో చేరాలన్న కాంగ్రెస్ అధినేత్రి విఙ్ఞప్తిని సవినయంగా తిరస్కరిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇక్కడో ఆసక్తికరమైన అంశం గురించి చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నట్లు ఏప్రిల్ 26న ట్వీట్ చేశారు పీకే. ఆ వెంటనే 10 నిమిషాల్లో దాన్ని డిలీట్ చేశారు. మళ్ళీ గంట తర్వాత అదే ట్వీట్‌ని కాస్త మార్చి మళ్ళీ ట్వీట్ చేశారు. పార్టీ ఆఫర్‌ను తిరస్కరిస్తూనే కాంగ్రెస్ పార్టీకి తనకంటే ఎక్కువగా సంస్థాగత మార్పులు చేయాల్సిన అవసరం వుందని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. PRASHANT KISHORE ట్వీట్ చేసిన కాసేపటికే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా RANADEEP SURJEWALA మరో ట్వీట్ చేశారు. తమ పార్టీలో చేరాలన్న ఆహ్వానాన్ని ప్రశాంత్ కిశోర్ తిరస్కరించారని సూర్జేవాలా పేర్కొన్నారు. మొత్తానికి పీకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇప్పట్లో తిరిగి రావడం లేదని క్లారిటీ వచ్చింది. అయితే ఇక్కడే కొన్ని మిలియన్ డాలర్ల ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. అదే కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనమే అనే స్థాయి నుంచి ఒక్కసారిగా తిరస్కారం దాకా పరిస్థితి ఎలా వచ్చింది ? అసలు తెరవెనుక ఏం జరిగింది ? పీకే ఎంట్రీని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలెవరు ఇలాంటి ప్రశ్నల పరంపర మొదలైంది.

ప్రశాంత్ కిశోర్ ఎంట్రీ పలువురు కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదన్న ప్రచారం ఆయన పార్టీలో చేరతారన్న ప్రచారంతోపాటే మొదలైంది. శతాధిక సంవత్సరాల చరిత్ర కలిగి, ఎందరో వ్యూహకర్తలు, కురువృద్ధ నేతలు వున్న పార్టీకి ఓ వ్యూహకర్త అవసరం లేదని పలువురు బాహాటంగానే అభిప్రాయపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్ అయితే పీకే ఎంట్రీ వద్దంటూ ట్వీటేశారు కూడా. దిగ్విజయ్ సింగ్, అశోక్ గెహ్లాట్, జైరాం రమేశ్ వంటి నేతలు సోనియా సారథ్యంలో జరిగిన పార్టీ ఇంటర్నల్ భేటీలోనే వ్యతిరేకించారు. ఈ ఇంటర్నల్ భేటీ జరుగుతుండగానే అందులోనే వున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అందించిన సమాచారం మేరకు, చేసిన సూచన మేరకే మాణిక్కం ఠాగూర్ పీకే ఎంట్రీకి వ్యతిరేకంగా ట్వీట్ చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ అంతర్గత భేటీ తర్వాతనే సోనియా ఎనిమిది సభ్యులున్న ఓ కమిటీని ఏర్పాటు చేశారు. పీకే ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై ఓ నివేదిక ఇవ్వాలని, ప్రశాంత్ కిశోర్‌కు పార్టీలో ఎలాంటి చోటు కల్పించాలో సూచించాలని ఆ కమిటీని సోనియా ఆదేశించారు. ఈ కమిటీలోని ఎనిమిది మందిలో ఏకంగా ఆరుగురు పీకే ఎంట్రీని వ్యతిరేకించారు. ఒకవేళ పార్టీలో చేర్చుకున్నా కేవలం యాక్షన్ గ్రూపు సభ్యునిగా మాత్రమే స్థానం కల్పించాలని సూచించారు. తనను తాను ఎంతో ఊహించుకుని కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పాలనుకున్న పీకే.. తనకు కేవలం యాక్షన్ గ్రూపు సభ్యునిగా మాత్రమే స్థానం కల్పిస్తామన్న కాంగ్రెస్ ఆఫర్‌ను తప్పనిసరి పరిస్థితిలో పరువు కోసం తిరస్కరించాల్సి వచ్చింది. ఇలాంటి అగత్యం ప్రశాంత్ కిశోర్‌కు కల్పించడంలో తెరవెనుక పాత్రను రాహుల్ గాంధీనే స్వయంగా పోషించారని తాజా సమాచారం. అందుకు ఆయన విదేశాల నుంచి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. మరి రాహుల్ గాంధీ పీకే ఎంట్రీని అడ్డుకోవాలని ఎందుకనుకున్నారు ? అందులో ఆయనకు సహకరించిన నేతలెవరు ? ఈ ప్రశ్నలకు సమాధానం మరింత ఆసక్తి రేపుతోంది.

ప్రశాంత్ కిశోర్ సోనియాగాంధీకి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో పార్టీ సారథ్య బాధ్యతల పంపకంపై కీలక ప్రతిపాదనలు చేశారు. అందులో ఒకటి CONGRESS PARTYని ముందుగా సంస్థాగతంగా మార్చివేయడం. కేవలం గాంధీ కుటుంబానికి చెందిన వారి పెత్తనమే పార్టీలో చెల్లుబాటు అవుతుందన్న అభిప్రాయాన్ని మార్చాల్సిన అవసరం వుందన్నది ప్రశాంత్ కిశోర్ సూచనగా తెలుస్తోంది. పార్టీని సంస్థాగతంగా మార్చడంలోను పీకే రెండు వేర్వేరు విధానాలను ప్రతిపాదించాడు. అందులో ఒకటి.. సోనియాగాంధీ యునైటెడ్ ప్రొగ్రెస్సివ్ అలయెన్స్ (యూపీఏ) ఛైర్‌పర్సన్‌ కొనసాగడం. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షునిగా గాంధీ కుటుంబేతర వ్యక్తిని నియమించడం. యుపీఏ లేదా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ బోర్డు నాయకునిగా రాహుల్‌గాంధీ, కో-ఆర్డినేషన్‌ జనరల్‌ సెక్రటరీగా ప్రియాంకా వధేరా గాంధీని నియమించడం ద్వారా భవిష్యత్తు ప్రణాళికను పక్కాగా అమలు చేయడం ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదనలో మొదటి అంశం. ఇలా చేయడం అంటే రాహుల్‌ గాంధీని పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా చేయడం వల్ల చట్టసభలో మోదీ వర్సెస్ రాహుల్‌ గాంధీగా పరిస్థితి మారుతుందనేది పీకే అంచనా. దీనివల్ల ప్రజల గొంతును పార్లమెంటు లోపల, బయట బలంగా వినిపించడానికి వీలవుతుందని ఆయన వ్యూహం. ఇక మీదట పార్టీలో వన్ పర్సన్ వన్ పోస్టు అన్న సిద్ధాంతాన్ని అనుసరించాలని కూడా ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అన్ని స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించి పార్టీ అనుబంధ సంస్థలను ప్రక్షాళన చేయాలని పీకే ప్రతిపాదించారు. కాగా ఇదే ప్రతిపాదనను కొద్దిగా మార్చి మరో ప్రపోజల్ కూడా పీకే సోనియా ముందుంచారు. యూపీఏ ఛైర్‌పర్సన్‌గా పాతతరం కాంగ్రెస్‌ నాయకుడిని పెట్టి, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగడం. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గాంధీయేతర కుటుంబ సభ్యుడిని నియమించడం. పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా రాహుల్‌గాంధీని ఎన్నుకోవడం. కోఆర్డినేషన్‌ జనరల్‌ సెక్రటరీగా ప్రియాంకా వధేరా గాంధీని నియమించడం. ఇలా మరో ప్రతిపాదనను కూడా పీకే కాంగ్రెస్ పెద్దల ముందుంచారు. అయితే ఇందుకు భిన్నంగా మరో ప్రతిపాదన కూడా ప్రచారంలో వుంది. అందులో పార్టీ ప్రెసిడెంట్ పదవిని ప్రియాంకా వధేరాకు ఇవ్వడం. రాహుల్ గాంధీని పార్లమెంటు బోర్డు ఛైర్మెన్‌గా నియమించడం. సరిగ్గా ఇదే ప్రతిపాదన రాహుల్ గాంధీని నచ్చలేదని తెలుస్తోంది. దాంతో సోనియా ఫ్యామిలీలో అభిప్రాయ భేదాలు పొడసూపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రియాంక, రాహుల్ మధ్య విభేదాలు మొదలైనట్లు సమాచారం.

అయితే.. అసలు ప్రశాంత్ కిశోర్‌ను పార్టీలోకి రప్పించాలన్న మొత్తం వ్యూహం వెనుక ప్రియాంకా గాంధీ వున్నారని అంటున్నారు. పార్టీలో తన ప్రాబల్యం పెరగడంతోపాటు రాహుల్ ప్రాధాన్యత తగ్గించేలా పీకేతో ప్రియాంకనే సూచనలు చేయించారని తెలుస్తోంది. సోనియాగాంధీతో ఏప్రిల్ 18న జరిగిన భేటీలో పాల్గొన్న రాహుల్ గాంధీ పీకే ప్రతిపాదనలు విన్న వెంటనే తనకు ఆ ప్రపోజల్స్ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని కుండబద్దలు కొట్టారని సమాచారం. ఆ తర్వాత రోజే రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్ళిపోయారు. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రియాంక, ప్రశాంత్ కిశోర్ యాక్షన్ ప్లాన్ ప్రారంభమైందని తెలుస్తోంది. పార్టీ ప్రెసిడెంటు కావాలని కోరుకున్న ప్రియాంక ఆ పనిని వ్యూహకర్త పీకే ద్వారా సాధించేందుకు వ్యూహరచన చేశారు. ఒకవేళ అది సాధ్యంకాకపోతే సోనియానే పార్టీ ప్రెసిడెంటుగా వుంటూ ప్రియాంకను వర్కింగ్ ప్రెసిడెంటుగా చేయాలని కూడా పీకే ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రియాంక వ్యూహాన్ని, పీకే ప్రతిపాదనలను తెలుసుకున్న రాహుల్ గాంధీ తన అభిప్రాయాన్ని సోనియాకు వివరించారని సమాచారం. ఈక్రమంలో రాహుల్, ప్రియాంక మధ్య ఏర్పడిన అభిప్రాయభేదాలు, ఆధిపత్యపోరును పరిశీలించిన సోనియా తనయుని వైపే మొగ్గు చూపారని, అందుకే కేవలం సభ్యునిగా మాత్రమే పార్టీలోకి పీకేని ఆహ్వానించారని చెప్పుకుంటున్నారు. ఈ ప్రతిపాదనకు పీకే ఎలాగో అంగీకరిచేది లేదని నిర్ధారించుకున్న తర్వాతనే ఈమేరకు ఇన్విటేషన్ పంపారని అంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే పీకే స్థాయిని తగ్గిస్తూ చేసిన ప్రతిపాదన వెనుక మరికొందరు కాంగ్రెస్ పెద్దల వ్యూహం కూడా వున్నట్లు చెప్పుకుంటున్నారు. మొత్తానికి తన ప్రాధాన్యాన్ని తగ్గించేలా ప్రతిపాదించిన ప్రశాంత్ కిశోర్‌కు రాహుల్ వర్గీయులు తమదైన శైలిలో చెక్ పెట్టారని, ఈ చర్యతో ప్రియాంకకు కూడా ఇకపై పరిమిత స్థాయిలోనే ప్రాధాన్యత వుంటుందని రాహుల్ వర్గీయులు చాటినట్లయ్యింది.

కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!