Lakhimpur Kheri: పంతం నెగ్గించుకున్న రాహుల్‌, ప్రియాంక.. లఖీంపూర్‌ ఖేరి రైతుల కుటుంబాలకు పరామర్శ

లఖీంపూర్‌ ఖేరి పొలిటికల్‌ టర్నింగ్‌ పాయింట్‌గా మారింది. విపక్షాల ఆందోళనలతో అట్టుడుకుతోంది యావత్ దేశం. అనుక్షణం హైడ్రామా మధ్య రాహుల్‌, ప్రియాంకాగాంధీ లఖింపూర్‌ ఖేరి పర్యటన కొనసాగింది.

Lakhimpur Kheri: పంతం నెగ్గించుకున్న రాహుల్‌, ప్రియాంక.. లఖీంపూర్‌ ఖేరి రైతుల కుటుంబాలకు పరామర్శ
Rahul Visit Lakhimpur Kheri
Follow us

|

Updated on: Oct 06, 2021 | 9:43 PM

Congress delegation to Lakhimpur Kheri: లఖీంపూర్‌ ఖేరి పొలిటికల్‌ టర్నింగ్‌ పాయింట్‌గా మారింది. విపక్షాల ఆందోళనలతో అట్టుడుకుతోంది యావత్ దేశం. అనుక్షణం హైడ్రామా మధ్య రాహుల్‌, ప్రియాంకాగాంధీ లఖింపూర్‌ ఖేరి పర్యటన కొనసాగింది. హింసాకాండలో చనిపోయిన రైతుల కుటుంబాలను కాంగ్రెస్‌ నేతలు పరామర్శించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా రాజీనామా చేసే ప్రసక్తే లేదని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.

పంతం మీద పంతం నెగ్గించుకున్నారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ. హింసతో అట్టుడికిన లఖీంపూర్‌ ఖేరిలో రైతుల కుటుంబాలను పరామర్శించారు కాంగ్రెస్‌ నేతలు. రాహుల్‌ గాంధీతో పాటు ప్రియాంకాగాంధీ కూడా చనిపోయిన రైతుల కుటుంబాలను, జర్నలిస్ట్‌ కుటుంబాన్ని పరామర్శించారు. ఐదుగురు కాంగ్రెస్‌ నేతలకు మాత్రమే లఖీంపూర్‌ వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. సీతాపూర్‌లో తన సోదరి ప్రియాంకాగాంధీని తోడుగా తీసుకొని లఖీంపూర్‌‌కు చేరుకున్నారు  రాహుల్‌. వీళ్లిద్దరితో పాటు పంజాబ్‌ సీఎం ఛన్నీ , చత్తీస్‌ఘడ్‌ సీఎం భూపేష్‌ బగేల్‌ , కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ వేణుగోపాల్‌ కూడా లఖీంపూర్‌ ఖేరీ వెళ్లారు. వీళ్లు ఐదుగురు తప్ప కాంగ్రెస్‌ కార్యకర్తలను లఖీంపూర్‌ ఖేరికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎట్టకేలకు దిగి వచ్చిన పోలీసులు సొంత వాహనంలో వెళ్లేందుకు అనుమతించడంతో రాహుల్ విమానాశ్రయం నుంచి బయటకు వచ్చారు.

ప్రియాంకను సీతాపూర్‌ జైలు నుంచి విడుదల చేశారు. దాదాపు 52 గంటల తరువాత ప్రియాంక విడుదలయ్యారు. కాన్వాయ్‌లో రాహుల్‌తో పాటు ప్రియాంక , పంజాబ్ సీఎం చన్నీ , చత్తీస్‌ఘడ్‌ సీఎం బగేల్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు. కార్యకర్తలను వెనక్కి పంపించారు పోలీసులు. అంతకుముందు లక్నో ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా జరిగింది. సెక్యూరటీ అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు రాహుల్‌. పోలీసుల తీరుపై మండిపడ్డారు రాహుల్‌. తొలుత సొంత వాహనంలో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారని , తరువాత ఎస్కార్ట్‌తో వెళ్లాలని మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తన నుంచి ఏం ఆశిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు రాహుల్‌ .. ఎట్టి పరిస్థితుల్లో కూడా లఖీంపూర్‌కు వెళ్తానని , బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని రాహుల్‌ స్పష్టం చేశారు.

రైతు కుటుంబాలకు పంజాబ్‌ సీఎం చన్నీ , చత్తీస్‌ఘడ్‌ సీఎం భూపేష్‌ బగేల్‌ 50 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించారు. అంతకుముందు చనిపోయిన రైతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం కూడా రూ. 45 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. లఖీంపూర్‌ హింసాకాండలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రంమంత్రి అజయ్‌ మిశ్రా రాజీనామా చేసే ప్రసక్తే లేదని బీజేపీ వర్గాలంటున్నాయి. ఈ ఘటనకు సంబంధించి విచారణ నిష్పక్షపాతంగా జరుగుతోందని, రైతులపై దూసుకెళ్లిన కాన్వాయ్‌లో కేంద్ర మంత్రి కుమారుడు ఆశిశ్‌ మిశ్రా లేడని కేంద్రం కూడా ధృవీకరించినట్టు చెబుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో జరిగిన సమావేశంలో అజయ్‌ మిశ్రా ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది.

మరోవైపు 8 రోజుల్లో కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు అశిశ్‌ మిశ్రాను అరెస్ట్‌ చేయాలని రైతు సంఘాల ప్రతినిధి రాకేశ్‌ టికాయత్‌ అల్టిమేటం జారీ చేశారు. లేదంటే దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా రైతు సంఘాలు ఉద్యమిస్తాయని హెచ్చరించారు. ఇదిలావుంటే, లఖీంపూర్ ఘటన సున్నిత అంశమని, దీనిని అడ్డు పెట్టుకుని ఉత్తరప్రదేశ్‌లో వాతావరణాన్ని పాడు చేయాలని ప్రయత్నించొద్దని ప్రతిపక్ష పార్టీలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిక చేశారు. లఖింపూర్‌కు కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల రాక సందర్భంగా ఏర్పడిన పరిస్థితులపై బుధవారం ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
పాయింట్ల పట్టికలో ముంబై దూకుడు.. పంజాబ్, గుజరాత్‌లకు భారీ షాక్
పాయింట్ల పట్టికలో ముంబై దూకుడు.. పంజాబ్, గుజరాత్‌లకు భారీ షాక్
వేసవిలో సాఫ్ట్ స్కిన్ కోసం గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు..
వేసవిలో సాఫ్ట్ స్కిన్ కోసం గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!
గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?
గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..
స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..