Rahul Gandhi: పెరిగిన ఇంధన ధరలపై రాహుల్ వినూత్న నిరసన.. సైకిల్ తొక్కుతూ పార్లమెంటుకు..

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మ‌న స్వరం వినిపిస్తే, మ‌న స్వరం అంత బ‌లంగా మారుతుంద‌న్నారు. ఈ క్రమంలో ఆయన సైకిల్‌పై పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు.

Rahul Gandhi: పెరిగిన ఇంధన ధరలపై రాహుల్ వినూత్న నిరసన.. సైకిల్ తొక్కుతూ పార్లమెంటుకు..
Rahul Gandhi On Bicycle
Follow us

|

Updated on: Aug 03, 2021 | 11:44 AM

Rahul Gandhi bicycle ride to Parliament: రోజురోజుకూ చుక్కలనంటుతున్న పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యవసరాల ధరలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వినూత్నరీతిలో నిరసన తెలిపారు. మంగళవారంనాడు సైకిల్‌పై పార్లమెంటు సమావేశాలకు వచ్చారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ భావ‌జాలానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ క‌లిసి పోరాడాల్సిన అవసరముందని రాహుల్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మ‌న స్వరం వినిపిస్తే, మ‌న స్వరం అంత బ‌లంగా మారుతుంద‌న్నారు. ఈ క్రమంలో ఆయన సైకిల్‌పై పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు.

అంతకుముందు లోక్‌స‌భ‌, రాజ్యస‌భ‌కు చెందిన విప‌క్ష పార్టీలు ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశానికి హాజ‌ర‌య్యారు. ప్రతిప‌క్ష పార్టీల‌కు చెందిన ఫ్లోర్‌లీడ‌ర్లు పాల్గొన్నారు. విప‌క్ష పార్టీ నేత‌ల‌తో కాన్‌స్టూష‌న్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన స‌మావేశానికి.. కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివ‌సేన‌, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్‌పీ, కేర‌ళ కాంగ్రెస్‌, జార్ఖండ్ ముక్తి మోర్చా, నేష‌న‌ల్ కాన్ఫరెన్స్‌, తృణ‌మూల్ కాంగ్రెస్‌, లోక‌తాంత్రిక్ జ‌న‌తాద‌ళ్ పార్టీల‌కు చెందిన ఫ్లోర్ లీడ‌ర్లు హాజ‌ర‌య్యారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మ‌నం అంతా క‌లిసి పోరాడాల‌ని రాహుల్ అన్నారు. విప‌క్ష పార్టీ నేత‌ల‌తో బ్రేక్‌ఫాస్ట్ ముగిసిన త‌ర్వాత‌.. రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు సైకిల్ యాత్ర చేప‌ట్టారు. ఆ ర్యాలీలో విప‌క్ష ఎంపీలు కూడా పాల్గొన్నారు. పెగాస‌స్ వ్య‌వ‌హారం, పెట్రో ధ‌ర‌లు, సాగు చ‌ట్టాల ర‌ద్దు అంశంలో కేంద్ర వైఖ‌రిని ప్రతిప‌క్ష పార్టీలు త‌ప్పుప‌ట్టాయి. మరోవైపు, ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా మాక్ పార్లమెంట్ నిర్వాహించాల‌ని విప‌క్షాలు భావిస్తున్న విష‌యం తెలిసిందే.

Read Also…

AP Lockdown: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ విధింపు..

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.