ఆప్ అభ్యర్థికి వెల్లువెత్తిన పెళ్లి ప్రపోజల్స్.. ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అట’!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదో ‘విచిత్రం’! వివరాల్లోకి వెళ్తే.. ఆప్ అభ్యర్థి రాఘవ్ ఛధ్ధా వయస్సు 31 ఏళ్ళు.. ఇంకేం ? ఇక వయస్సులో ఉన్నాడు. రోడ్ షోలు, ప్రచారంలో తలమునకలై ఉన్న ఛధ్ధాకు పెళ్లి ప్రపోజల్స్ వెల్లువెత్తుతున్నాయట. రాజేందర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఈయనకు ఈ ప్రపోజల్స్ అన్నీ ఓట్లుగా మారుతాయో ఏమో తెలియదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం ‘ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే పేరు తెచ్చుకున్నాడు. చార్దర్డ్ అకౌంటెంట్ […]

ఆప్ అభ్యర్థికి వెల్లువెత్తిన పెళ్లి ప్రపోజల్స్..  'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అట'!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదో ‘విచిత్రం’! వివరాల్లోకి వెళ్తే.. ఆప్ అభ్యర్థి రాఘవ్ ఛధ్ధా వయస్సు 31 ఏళ్ళు.. ఇంకేం ? ఇక వయస్సులో ఉన్నాడు. రోడ్ షోలు, ప్రచారంలో తలమునకలై ఉన్న ఛధ్ధాకు పెళ్లి ప్రపోజల్స్ వెల్లువెత్తుతున్నాయట. రాజేందర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఈయనకు ఈ ప్రపోజల్స్ అన్నీ ఓట్లుగా మారుతాయో ఏమో తెలియదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం ‘ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే పేరు తెచ్చుకున్నాడు. చార్దర్డ్ అకౌంటెంట్ అయినప్పటికీ రాజకీయ నాయకుడిగా మారిన ఈయన తన ట్విటర్, ఇన్స్ టా గ్రామ్ లలో చురుగ్గా ఉంటాడు. మరి ఇదే అదనని అనుకుందో ఏమో తనను వివాహం చేసుకోవాలని ఓ మహిళ కోరిందని, అయితే దేశ ఆర్ధిక వ్యవస్థ సరిగా లేనందున ఈ సమయంలో పెళ్లి చేసుకోలేనని ఛధ్ధా స్పష్టం చేశాడని తెలుస్తోంది. ప్రచారం సందర్భంగా ఓ స్కూలుకు వెళ్ళినప్పుడు ఒక టీచర్ తన కూతురిని ఛధ్ధాకు ఇఛ్చి పెళ్లి జరిపించాలని అనుకుందని కూడా ఇతని సోషల్ మీడియా వ్యవహారాలు చూసే మేనేజర్ తెలిపారు,. మరొక మహిళ తనను తప్ప ఎవరినీ వివాహం చేసుకోరాదని రాఘవ్ ని కోరినట్టు ఆయన చెబుతున్నారు. ఇలా ఈయనకు ఎన్నో మ్యారేజ్ ప్రపోజల్స్ వఛ్చి పడుతున్నట్టు సమాచారం.

Published On - 5:43 pm, Wed, 5 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu