Punjab Politics: పంజాబ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం.. హోంమంత్రి అమిత్ షాతో కెప్టెన్ అమరీందర్ సింగ్ భేటీ

Punjab Political Crisis: దేశ రాజధాని ఢిల్లీలోని నివాసాన్ని ఖాళీని చేయడానికే వచ్చానని చెప్పిన పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ కాంగ్రెస్‌ హైకమాండ్‌కు గట్టి షాకిచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఆయన భేటీ అయ్యారు.

Punjab Politics: పంజాబ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం.. హోంమంత్రి అమిత్ షాతో కెప్టెన్ అమరీందర్ సింగ్ భేటీ
Amarinder Singh Meet Amit Shah in Delhi
Follow us

|

Updated on: Sep 29, 2021 | 8:16 PM

Amarinder meet Amit Shah: దేశ రాజధాని ఢిల్లీలోని నివాసాన్ని ఖాళీని చేయడానికే వచ్చానని చెప్పిన పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ కాంగ్రెస్‌ హైకమాండ్‌కు గట్టి షాకిచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఆయన భేటీ అయ్యారు. ఇద్దరు నేతల సమావేశమై దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనుహ్య పరిణామాల నేపథ్యంలో ఈనెల 18వ తేదీన పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు అమరీందర్‌. తనను హైకమాండ్‌ అవమానించిందని ఆగ్రహంతో ఉన్న అమరీందర్‌ బీజేపీ అగ్రనేతలకు దగ్గరయ్యారు.

కెప్టెన్‌ భవిష్యత్‌ కార్యాచరణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన బీజేపీలో చేరుతారా ? లేక కొత్త పార్టీ పెట్టి బీజేపీకి మద్దతిస్తారా ? అన్న విషయంపై సస్పెన్స్‌ నెలకొంది. అమరీందర్‌ ఎత్తులు ఎవరికి అర్ధం కావడం లేదు. అమరీందర్‌సింగ్‌ను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుంటారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయనకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి పదవి ఇస్తారన్న వార్తలు వెలువడుతున్నాయి. పంజాబ్‌లో పార్టీ నేతల మధ్య విభేదాలు కాంగ్రెస్‌ హైకమాండ్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. మరోవైపు, పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. పంజాబ్ పీసీసీ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా సమర్పించారు. ఇదిలావుంటే, పార్టీ నాయకత్వం లోపం వల్లే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయని సీనియర్ నేతలు సైతం గగ్గోలు పెడుతున్నారు.

తాజాగా కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌లోని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధికార నివాసానికి సాయంత్రం వెళ్లారు. అయితే అమిత్‌ షాతో అమరీందర్‌ సింగ్‌ భేటీకి కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియకపోయినా, ఆయన బీజేపీలో చేరేందుకేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పంజాబ్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం నేపథ్యంలో సీఎం పదవికి అమరీందర్‌ సింగ్‌ ఇటీవల రాజీనామా చేశారు.

అయితే, తన ఢిల్లీ పర్యటన రాజకీయ నేతలను కలిసేందుకు కాదని అమరీందర్‌ సింగ్‌ మంగళవారం తెలిపారు. పంజాబ్‌ కొత్త సీఎం కోసం అధికార నివాసమైన కపుర్తలా హౌస్‌ను ఖాళీ చేసేందుకే ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. కాంగ్రెస్‌ను వీడబోనని సీఎం పదవికి రాజీనామా తర్వాత ఆయన అన్నారు. కాగా, కొత్త సీఎం చరంజిత్ సింగ్ చన్నీ తనను సంప్రదించకుండా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన సిద్ధూ పీసీసీ పదవికి మంగళవారం రాజీనామా చేశారు.

Read Also…  Modi Cabinet Meet: మధ్యాహ్న భోజన పథకం ఇకపై పీఎం న్యూట్రిషన్.. కేంద్ర క్యాబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు!

High Court: ఉపాధి హమీ పథకం బిల్లుల చెల్లింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు.. విచారణ వచ్చే నెల 4వ తేదీకి వాయిదా!

Chiranjeevi : మెగాస్టార్ సినిమాలో మాస్ రాజా.. చిరు నటిస్తున్న ఆ సినిమాలో కీలక పాత్రలో రవితేజ..!!

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు