Boy Falls In Borewell: బోరుబావిలో పడిన బాలుడు.. కొనసాగుతోన్న రెస్య్కూ ఆపరేషన్‌.. పంజాబ్‌లో ఘటన..

పంజాబ్‌(Punjab)లోని హోషియార్‌పూర్ జిల్లా గడ్డివాలా సమీపంలో 6 ఏళ్ల బాలుడు 100 అడుగుల లోతైన బోరుబావి(Borewell)లో పడిపోయాడు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు...

Boy Falls In Borewell: బోరుబావిలో పడిన బాలుడు.. కొనసాగుతోన్న రెస్య్కూ ఆపరేషన్‌.. పంజాబ్‌లో ఘటన..
Borewell
Follow us

|

Updated on: May 22, 2022 | 6:32 PM

పంజాబ్‌(Punjab)లోని హోషియార్‌పూర్ జిల్లా గడ్డివాలా సమీపంలో 6 ఏళ్ల బాలుడు 100 అడుగుల లోతైన బోరుబావి(Borewell)లో పడిపోయాడు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. ఆ చిన్నారి ఇక్కడి బహరంపూర్ గ్రామ నివాసి. బాబును కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్(rescue operations) నిర్వహిస్తున్నారు. బహరంపూర్‌ గ్రామానికి చెందిన పిల్లవాడు ఆడుకుంటున్నప్పుడు, కొన్ని వీధి కుక్కలు అతనిని వెంబడించాయి. దీంతో పిల్లవాడు బోరుబావిపై నుంచి దూకడానికి ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు దానిలో పడిపోయాడు. బోర్‌వెల్ పైభాగంలో జూట్ బ్యాగ్‌తో కప్పారు. కానీ బాబు బరువుకు అది చిరిగిపోయి పిల్లవాడు పడిపోయాడు. సమాచారం అందిన వెంటనే కమిషనర్‌తోపాటు జిల్లా యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుంది. ఎన్‌డిఆర్‌ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాన్ని కూడా పిలిపించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, జిల్లా యంత్రాంగంతో నిరంతరం టచ్‌లో ఉన్నామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చెప్పారు. మాన్ ట్వీట్ చేస్తూ, ‘6 ఏళ్ల హృతిక్ హోషియార్‌పూర్‌లోని బోర్‌వెల్‌లో పడిపోయాడు. జిల్లా యంత్రాంగం, స్థానిక ఎమ్మెల్యే అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. వారితో నేను నిరంతరం టచ్‌లో ఉన్నాను. అని చెప్పారు.

పైపుల ద్వారా ఆక్సిజన్ వైద్య బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. చిన్నారి పరిస్థితిని పర్యవేక్షించేందుకు బోర్‌వెల్‌లో కెమెరాను అమర్చినట్లు అధికారులు తెలిపారు. పైపుల ద్వారా ఆక్సిజన్‌ను కూడా లోపలికి సరఫరా చేస్తున్నారు. చిన్నారి క్షేమంగా బయటకు రావాలని ప్రార్థిస్తున్నట్లు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ తెలిపారు. హోషియార్‌పూర్‌లో బోర్‌వెల్‌లో పడిపోయిన 6 ఏళ్ల హృతిక్‌ని త్వరగా, సురక్షితంగా తరలించాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన ట్వీట్‌లో తెలిపారు. హోషియార్‌పూర్ డిప్యూటీ కమిషనర్ సందీప్ హన్స్ మాట్లాడుతూ, ‘పిల్లవాడు లోతైన బోరుబావిలో పడిపోయాడు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడానికి మేము ఇప్పటికే NDRF, ఆర్మీ బృందాన్ని పిలిచాము. పిట్‌కు అధిక-ఫ్లో ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నామని, కెమెరాల సహాయంతో పిల్లల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ తర్వాత, బిడ్డకు తక్షణమే చికిత్స అందించడానికి వైద్య బృందాలను పిలిచామని హన్స్ చెప్పారు. చిన్నారి అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు తెలుస్తోందని డిప్యూటీ కమిషనర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..