Bhagwant Mann Marriage: గురువారం పంజాబ్ సీఎం వివాహం.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా..

Bhagwant Mann Wedding: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వివాహం గురువారం జరగనుంది. అందుతున్న సమాచారం ప్రకారం పెళ్లి చండీగఢ్‌లో జరగనుంది. సీఎం భగవంత్‌ మాన్‌కు డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌తో..

Bhagwant Mann Marriage: గురువారం పంజాబ్ సీఎం వివాహం.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా..
Bhagwant Mann Marriage
Follow us

|

Updated on: Jul 06, 2022 | 2:30 PM

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వివాహం గురువారం జరగనుంది. అందుతున్న సమాచారం ప్రకారం పెళ్లి చండీగఢ్‌లో జరగనుంది. సీఎం భగవంత్‌ మాన్‌కు డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌తో వివాహం జరుగబోతోంది. ఈ వివాహ వేడుక సీఎం మాన్ నివాసంలోనే జరగనుంది. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. భగవంత్ మాన్ 6 సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అతని మొదటి భార్య ఇందర్‌జిత్ కౌర్, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. 2016లో ఇద్దరి మధ్య విడాకుల తర్వాత ఇంద్రజిత్ పిల్లలతో కలిసి అమెరికా వెళ్లారు. ఇంతకుముందు మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు పిల్లలిద్దరూ భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చారు.

తల్లి సోదరి బాలికను ఎంచుకున్నట్లు..

ఇవి కూడా చదవండి

మరో వివాంహం చేసుకోవాలంటూ.. గత కొంత కాలం సీఎం భగవంత్ మాన్‌పై కుటుంబ సభ్యుల నుంచి ఒత్తి పెరుగుతోంది. దీంతో భగవంత్ మాన్ తల్లి హర్పాల్‌, సోదరి మన్‌ప్రీత్ కౌర్ స్వయంగా పెళ్లి కూతురుని ఎంపిక చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి కాకముందు.. భగవంత్ మాన్ రాష్ట్రంలోని సంగ్రూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. 2014, 2019లో వరుసగా రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది మార్చిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనను ముఖ్యమంత్రిగా ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేసింది. రాష్ట్రంలో అఖండ మెజారిటీ సాధించి భగవంత్ మాన్ సీఎం అయ్యారు.