Maharashtra: ప్రధాని హత్యకు కుట్ర..! ఫ్లాట్‌లో ప్లాన్‌ చేస్తున్నారంటూ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కి ఫోన్‌కాల్‌..

ప్రధాని నరేంద్ర మోడీని హతమార్చేందుకు, పూణె , ముంబై రైల్వే స్టేషన్లలో బాంబు పేలుళ్లకు ఓ ఫ్లాట్‌లో కుట్ర జరుగుతోందని ఆ వ్యక్తి ఫోన్‌లో పేర్కొన్నాడు.

Maharashtra: ప్రధాని హత్యకు కుట్ర..! ఫ్లాట్‌లో ప్లాన్‌ చేస్తున్నారంటూ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కి ఫోన్‌కాల్‌..
Fake Phone Call
Follow us

|

Updated on: Oct 07, 2022 | 7:32 AM

ప్రధాని నరేంద్ర మోడీని హతమార్చేందుకు కుట్ర జరుగుతోందంటూ మహారాష్ట్ర పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కి ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. దాంతో మహా పోలీసు యంత్రాంగం మొత్తం అలర్ట్‌ అయ్యింది. పూణె, ముంబై రైల్వే స్టేషన్లలో బాంబు పేలుళ్లకు ఓ ఫ్లాట్‌లో కుట్ర జరుగుతోందని ఆ వ్యక్తి ఫోన్‌లో పేర్కొన్నాడు. ఎట్టకేలకు ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫేక్‌ ఫోన్‌ కాల్ చేసినందుకు 38 ఏళ్ల వ్యక్తిని పూణేలో అరెస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని హతమార్చేందుకు, పూణె , ముంబై రైల్వే స్టేషన్లలో బాంబు పేలుళ్లకు ఓ ఫ్లాట్‌లో కుట్ర జరుగుతోందని ఆ వ్యక్తి ఫోన్‌లో పేర్కొన్నాడు. ఈ మేరకు గురువారం ఓ అధికారి వివరాలు వెల్లడించారు.

పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కి కాల్‌ చేసిన నిందితుడు సమీపంలోని పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలోని దేహు రోడ్ ప్రాంతంలో నివసిస్తున్నట్టు గుర్తించారు… అయితే, అతడు డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని, అతని ఫ్లాట్‌లో నివసిస్తున్న పిల్లల సందడి, అల్లరిని భరించలేకపోయాడని పోలీసులు తెలిపారు. ఫ్లాట్‌లో నివసిస్తున్న పిల్లల అల్లరి తగ్గించి, వారికి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఈ క్రమంలోనే అక్టోబర్ 4న ఎమర్జెన్సీ నంబర్ 112కు ఫోన్ చేసినట్లు అధికారి తెలిపారు.

పోలీస్‌ కంట్రోల్‌112 ఎమర్జెన్సీ లైన్‌కు మనోజ్ హన్సేకు కాల్ వచ్చింది. ప్రధాని మోడీని హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని, పూణె, ముంబై రైల్వే స్టేషన్లలో బాంబు పేలుళ్లకు కుట్ర జరుగుతోందన్నారు. పోలీసుల విచారణలో అది ఫేక్ కాల్ అని తేలింది. నిందితుడు డిప్రెషన్‌లో ఉన్నాడని, తన పైనున్న ఫ్లాట్ నుంచి వచ్చిన శబ్ధంతో చిరాకు పడ్డాడని తెలిపారు. నిందితుడు పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగాడని చెప్పారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..