కంగనాపై కామెంట్‌ చేసిన శివసేన ఎమ్మెల్యే ఇంటిపై ఈడీ దాడులు

శివసేన ఎమ్మెల్యే ప్రతాప్‌ సర్నాయక్‌ ఇళ్లపైనా , కార్యాలయాలపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులకు దిగింది.. ముంబాయి, థానే నగరాలలో మొత్తం పది చోట్ల ఆయన కార్యాలయాలు , ఆయన సంబంధీకుల కార్యాలయాలు, బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. మహారాష్ట్ర శివసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న ప్రతాప్‌ సర్నాయక్‌ థానేలోని ఓవ్లా మజ్వాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇవాళ పొద్దున్నే ఆయన ఇంటికి చేరుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీ లాండరింగ్‌ ఆరోపణల కేసులో సోదాలు […]

  • Balu
  • Publish Date - 12:21 pm, Tue, 24 November 20
కంగనాపై కామెంట్‌ చేసిన శివసేన ఎమ్మెల్యే ఇంటిపై ఈడీ దాడులు

శివసేన ఎమ్మెల్యే ప్రతాప్‌ సర్నాయక్‌ ఇళ్లపైనా , కార్యాలయాలపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులకు దిగింది.. ముంబాయి, థానే నగరాలలో మొత్తం పది చోట్ల ఆయన కార్యాలయాలు , ఆయన సంబంధీకుల కార్యాలయాలు, బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. మహారాష్ట్ర శివసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న ప్రతాప్‌ సర్నాయక్‌ థానేలోని ఓవ్లా మజ్వాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇవాళ పొద్దున్నే ఆయన ఇంటికి చేరుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీ లాండరింగ్‌ ఆరోపణల కేసులో సోదాలు చేస్తున్నట్టు తెలిపింది.. ముంబాయిని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చిన బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రౌత్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని ప్రతాప్‌ సర్నాయక్‌ డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. అలాగే కంగనా రౌత్‌ ఇక్కడికి వస్తే ముంబాయి మహిళలు ఆమెను నిద్రపోనివ్వరని కూడా అన్నారు..ఈ కామెంట్ల తర్వాతే ప్రతాప్‌ సర్నాయక్‌పై మనీ లాండరింగ్‌ ఆరోపణలు వచ్చాయి.. ఇప్పుడు ఈడీ కూడా దాడులు చేపట్టడం థానే నగరంలో కలకలం సృష్టిస్తోంది..