Priyanka Gandhi: కాంగ్రెస్‌లో కరోనా కల్లోలం.. ప్రియాంక గాంధీకి మరోసారి పాజిటివ్.. అటు రాహుల్ కూడా..

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈవిషయాన్ని స్వయంగా ఆమె ట్వి్ట్టర్ ఖాతాలో ప్రకటించారు. గతంలోనూ ఒకసారి ప్రియాంక గాంధీ కోవిడ్ బారిన పడ్డారు. ఆమెకు కరోనా పాజిటివ్ రావడం ఇది రెండోసారి. తాను ఐసోలేషన్ లో ఉన్నానని, కోవిడ్ ప్రొటోకాల్ ను పాటిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

Priyanka Gandhi: కాంగ్రెస్‌లో కరోనా కల్లోలం.. ప్రియాంక గాంధీకి మరోసారి పాజిటివ్.. అటు రాహుల్ కూడా..
Priyanka Gandhi
Follow us

|

Updated on: Aug 10, 2022 | 12:04 PM

Priyanka Gandhi: కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈవిషయాన్ని స్వయంగా ఆమె ట్వి్ట్టర్ ఖాతాలో ప్రకటించారు. గతంలోనూ ఒకసారి ప్రియాంక గాంధీ కోవిడ్ బారిన పడ్డారు. ఆమెకు కరోనా పాజిటివ్ రావడం ఇది రెండోసారి. తాను ఐసోలేషన్ లో ఉన్నానని, కోవిడ్ ప్రొటోకాల్ ను పాటిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో రాజస్థాన్ లోని అల్వార్ పర్యటన రద్దయింది. రాహుల్ గాందీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సంకల్ప్ శిబిరంలో పాల్గొనాల్సి ఉంది. పార్టీ బలోపేతానికి ఇటీవల కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారాన్ని నిలబెట్టకునేందుకు ఇప్పటినుంచే కాంగ్రెస్ అధిష్టానం చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా రాజస్థాన్ పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఈఏడాది మేలో కాంగ్రెస్ చింతన్ శిబిర్ రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరగింది. ఈసభలోనే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు. ఈఏడాది జూన్ లో కూడా ప్రియాంక గాంధీ కోవిద్ బారిన పడ్డారు. ఆసమయంలోనూ ఆమె ఒంటరిగా ఐసోలేషన్ ఉండి చికిత్స పొందారు. మరో రెండు నెలలు తిరగకుండానే ఈఏడాదిలో రెండోసారి ప్రియాంకగాంధీకి కరోనా వైరస్ సోకింది.

ప్రియాంకగాంధీతో పాటు కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ కూడా కోవిడ్ బారిన పడిన వారిలో ఉన్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కూడా తనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు ట్విట్టర్ లో తెలిపిన విషయం తెలిసిందే. ఇటీవల నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈడీ విచారణకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున్న పాల్గోన్నారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలకు వరుసగా కోవిడ్ సోకుతుండటంతో పార్టీ నాయకుల్లో ఆందోళన నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

'పది' పరీక్షల్లో వింతలు.. తెలుగు పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రం
'పది' పరీక్షల్లో వింతలు.. తెలుగు పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రం
ముందు నుయ్యి వెనక గొయ్యి.. అనేలా దర్శకుల పరిస్థితి.. వారెవరంటే.?
ముందు నుయ్యి వెనక గొయ్యి.. అనేలా దర్శకుల పరిస్థితి.. వారెవరంటే.?
ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారేంట్రా.. కారునే హెలికాప్టర్‌గా మార్చేశారు!
ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారేంట్రా.. కారునే హెలికాప్టర్‌గా మార్చేశారు!
విమానాల టేకాఫ్‌ సమయంలో ఏసీలు ఎందుకు ఆఫ్‌ చేస్తారు?
విమానాల టేకాఫ్‌ సమయంలో ఏసీలు ఎందుకు ఆఫ్‌ చేస్తారు?
అందుకే బోల్డ్‌గా నటించా.. అసలు విషయం చెప్పిన అనుపమ
అందుకే బోల్డ్‌గా నటించా.. అసలు విషయం చెప్పిన అనుపమ
30 కిలోలు తగ్గిపోయి అస్తిపంజరంలా మారిన నటుడు..ఎవరో గుర్తుపట్టారా?
30 కిలోలు తగ్గిపోయి అస్తిపంజరంలా మారిన నటుడు..ఎవరో గుర్తుపట్టారా?
ముంబై స్టార్ పేసర్ ఔట్.. కట్‌చేస్తే.. బాబర్ ఆజాం ప్లేయర్ ఇన్
ముంబై స్టార్ పేసర్ ఔట్.. కట్‌చేస్తే.. బాబర్ ఆజాం ప్లేయర్ ఇన్
సర్కార్ సొమ్ముకు కక్కుర్తిపడి అన్నచెల్లెలికి పెళ్లి..!
సర్కార్ సొమ్ముకు కక్కుర్తిపడి అన్నచెల్లెలికి పెళ్లి..!
అమ్మో.. ఢిల్లీ.. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ
అమ్మో.. ఢిల్లీ.. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ
దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్.. కొత్త కోపైలట్ ప్రో ఆవిష్కరణ
దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్.. కొత్త కోపైలట్ ప్రో ఆవిష్కరణ