దూబే అరెస్టుపై సీబీఐ విచారణ.. ప్రియాంక గాంధీ డిమాండ్

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ‘నాటకీయ’ అరెస్టుపై సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్ చేశారు. ఉజ్జయిని లోని మహాకాల్ ఆలయం వద్ద అతడ్ని పోలీసులు ఈ ఉదయం అరెస్టు చేశారు. ఈ నేరగాడికి, ఉన్నత స్థాయి అధికారులు, లేదా పోలీసులకు మధ్య ఉన్న సంబంధాలు బయటపడాలంటే సీబీఐ దర్యాప్తు అవసరమని ప్రియాంక ట్వీట్ చేశారు. కాన్పూర్ లో దారుణంగా 8 మంది పోలీసులను దూబే, అతని అనుచరులు పొట్టన బెట్టుకున్నప్పటికీ […]

దూబే అరెస్టుపై సీబీఐ విచారణ.. ప్రియాంక గాంధీ డిమాండ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 09, 2020 | 4:18 PM

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ‘నాటకీయ’ అరెస్టుపై సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్ చేశారు. ఉజ్జయిని లోని మహాకాల్ ఆలయం వద్ద అతడ్ని పోలీసులు ఈ ఉదయం అరెస్టు చేశారు. ఈ నేరగాడికి, ఉన్నత స్థాయి అధికారులు, లేదా పోలీసులకు మధ్య ఉన్న సంబంధాలు బయటపడాలంటే సీబీఐ దర్యాప్తు అవసరమని ప్రియాంక ట్వీట్ చేశారు. కాన్పూర్ లో దారుణంగా 8 మంది పోలీసులను దూబే, అతని అనుచరులు పొట్టన బెట్టుకున్నప్పటికీ యూపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆమె ఆరోపించారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాక మరేమిటన్నారు. వికాస్ దూబే గురించి అలెర్ట్ చేసినప్పటికీ అతడు ఉజ్జయిని చేరుకోగలిగాడంటే.. ఈ సెక్యూరిటీ వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందొ అర్థమవుతోందని, ఇతనికి, ఉన్నత స్థాయి వ్యక్తులకు మధ్య ఉన్న లింక్ తెలుస్తోందని ఆమె అన్నారు.

దూబే అరెస్టు…’ముందుగా వేసుకున్న లొంగుబాటు’ అని విపక్షాలు విమర్శించాయి. ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయానికి వెళ్లిన దూబే.. అక్కడి సెక్యూరిటీ గార్డులకు తాను ఎవరో చెప్పాడని, తన గురించి పోలీసులకు తెలియజేయాలని కోరాడని కూడా అంటున్నారు. అతడు ఆలయంలోని ఓ సోఫాలో దర్జాగా కూర్చున్న ఫోటో ఒకటి వైరల్ అయింది.

కాగా-దూబే వీఐపీ పాస్ తో మహాకాల్ టెంపుల్ లో ప్రవేశించాడట.. ఈ వ్యవహారంతో సహా .. ‘రెక్కలుచాచిన’   ఇతని అన్ని నేరాలపైనా సమగ్ర విచారణ జరగాలని, బీజేపీతో ఇతనికి ఉన్న లింకులను బయటపెట్టాలని కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ వంటి విపక్షాలు కోరుతున్నాయి.