మహాలక్ష్మి హత్య కేసులో నిందితుడిని గుర్తించాం.. త్వరలోనే పట్టుకుంటాం.. పోలీసుల కీలక ప్రకటన..

ఢిల్లీలో శ్రద్ధా వాకర్​ తరహాలో బెంగళూరులో మహాలక్ష్మి అనే మహిళ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.. బెంగళూరు నగరంలోని వయాలికావల్‌లో నివసిస్తున్న 29ఏళ్ల మహిళను దారుణంగా హత్య చేసి 30కి పైగా ముక్కలు చేసి ఫ్రీజర్‌లో దాచారు..

మహాలక్ష్మి హత్య కేసులో నిందితుడిని గుర్తించాం.. త్వరలోనే పట్టుకుంటాం.. పోలీసుల కీలక ప్రకటన..
Mahalakshmi Murder Case
Follow us

|

Updated on: Sep 23, 2024 | 3:01 PM

ఢిల్లీలో శ్రద్ధా వాకర్​ తరహాలో బెంగళూరులో మహాలక్ష్మి అనే మహిళ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.. బెంగళూరు నగరంలోని వయాలికావల్‌లో నివసిస్తున్న 29ఏళ్ల మహిళను దారుణంగా హత్య చేసి 30కి పైగా ముక్కలు చేసి ఫ్రీజర్‌లో దాచారు.. ఆ తర్వాత ఆమె ఫొన్ స్విచ్ఛాఫ్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శరీరం ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్‌లో ఉంచారని.. కుళ్లిపోయిన స్థితిలో శరీర భాగాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే.. మహాలక్ష్మి హత్య కేసులో ప్రధాన నిందితుడిని గుర్తించినట్లు బెంగళూరు పోలీసు కమిషనర్ బి దయానంద సోమవారం తెలిపారు. ఈ కేసులో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, ప్రధాన నిందితుడిని గుర్తించామని, అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన కమిషనర్ దయానంద పలు కీలక విషయాలను వెల్లడించారు. నిందితుడు బయటి రాష్ట్రంలో ఉన్నాడని.. తాము చెప్పే విషయాలు నిందితులకు సహాయపడే అవకాశం ఉన్నందున ప్రస్తుతానికి మరింత సమాచారం ఇవ్వలేమని తెలిపారు.

అంతకుముందు రోజు కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ.. మహిళ మృతికి సంబంధించి పోలీసులు చాలా సమాచారాన్ని సేకరించారన్నారు. హత్య వెనుక పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారని, అయితే అతని పాత్రను నిర్ధారించడానికి మరిన్ని ఆధారాలు అవసరమని మంత్రి అన్నారు.

మహాలక్ష్మి అనే మహిళ గత ఐదు నెలలుగా బెంగుళూరులోని వయాలికావల్‌లోని వినాయక నగర్‌లో ఒంటరిగా నివాసముంటోంది.. తన భర్త హుకుమ్​ సింగ్​ నేలమంగళలో నివసిస్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఒంటరిగా నివసిస్తోంది.. సెప్టెంబరు 21న ఆమె నివసిస్తున్న ఇంటి ఫ్రిజ్‌లో ఆమె శరీర భాగాలను కుళ్లిపోయిన స్థితిలో గుర్తించారు. దుర్వాసన రాకుండా రసాయనాలు చల్లి ఇంటికి తాళం వేసి పరారైనట్లు తెలిపారు. అయితే బాధితురాలి ఫోన్​ సెప్టెంబర్​ 2న అయిందని, అదే రోజు హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు పేర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..