దేశంలో కరోనా వైరస్(Corona Virus) కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. కొవిడ్ కేసుల తగ్గుదలలో టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ప్రజలకు వైరస్ నుంచి మరింత రక్షణ ఇచ్చేందుకు బూస్టర్ డోస్ టీకా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ పంపిణీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మాట్లాడారు. దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గుతున్నప్పటికీ అది ఇంకా అంతరించిపోలేదని, మళ్లీ పుంజుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కరోనాపై చేస్తున్న పోరులో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించవద్దని కోరారు. ఎన్నో రూపాలు మార్చుకుంటున్న మహమ్మారి.. మళ్లీ ఎప్పుడు విరుచుకుపడుతుందో తెలియదని అన్నారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఇప్పటి వరకు 185కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించారు. ప్రజల మద్దతుతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. అత్యంత వేగంగా సంక్రమించే సామర్థ్యమున్నట్లు భావిస్తున్న ‘XE’ వేరియంట్ గుజరాత్‌లో వెలుగు చూసిందని ప్రజలకు అప్రమత్తం చేశారు. గత నెల ముంబయి నుంచి వడోదరా వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ ఉపరకమైన ఎక్స్‌ఈ సోకిందని వెల్లడించారు. బాధితుడు వడోదరాలో ఉన్నప్పుడు మార్చి 12న కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, ఆ మర్నాడే ఆయన స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వకుండా ముంబయి తిరిగి వెళ్లిపోయారని చెప్పారు. అనంతరం గాంధీనగర్‌లోని ప్రయోగశాల ఇచ్చిన నివేదిక ప్రకారం అతనికి సోకింది ఎక్స్‌ఈ వేరియంట్‌గా తేలిందన్నారు. అయితే, ప్రస్తుతం ముంబయిలో ఉన్న బాధితుడి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.
కరోనా మహమ్మారి అతిపెద్ద సంక్షోభం. అది ఇప్పుడే ముగిసిపోయిందని చెప్పడం లేదు. ప్రస్తుతం విరామం తీసుకొని ఉండవచ్చు. కానీ, మళ్లీ ఎప్పుడు విరుచుకుపడుతుందో తెలియదు. అది ఎన్నో రూపాలు కలిగిన వ్యాధి. అటువంటి దాన్ని అడ్డుకునేందుకు ఇప్పటివరకు 185 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించి యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాం. ప్రజల సహకారంతోనే అది సాధ్యమైంది.
– ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. మాతృభూమిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇందు కోసం ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ప్రతి గ్రామం నుంచి రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Also Read
Sita Ramam Glimpse : యుద్ధంలో ‘సీత రామం’ ప్రేమకథ.. ఆకట్టుకుంటున్న గ్లిమ్ప్స్
Asia Cup: ఈ ఏడాదైనా ఆసియా కప్ జరిగేనా? విపత్తులా మారిన శ్రీలంక పరిస్థితులు..
Viral: వ్యక్తి చనిపోయాడని కన్ఫామ్ చేసిన డాక్టర్లు.. అంత్యక్రియలకు ముందు స్నానం చేయిస్తుండగా షాక్!