పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

president rule in puducherry: పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాస..

  • Shaik Madarsaheb
  • Publish Date - 10:48 am, Wed, 24 February 21
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

president rule in puducherry: పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో గవర్నర్‌ తమిళసై రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

గత కొన్ని రోజుల నుంచి పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. నారయణస్వామి ప్రభుత్వం బలపరీక్షలో ఓడిపోవడం, అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ కూడా ముందుకు రాలేదు. అనంతరం ఇన్‌ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం పుదుచ్చేరి అసెంబ్లీని రద్దు చేశారు.

Also Read:

Central Electoral Commission: బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలపై కసరత్తు..

MP Rahul Gandhi: ఉత్తరాది రాజకీయాలకు అలవాటుపడ్డ తనకు కేరళ కొత్తగా ఉంది.. తిరువనంతపురంలో రాహుల్ మనసులో మాట..