మోడీ ఒకే అంటే బాలాకోట్ తరహా దాడులు మరోసారి ?

కేంద్రం ఆదేశిస్తే బాలాకోట్ లాంటి దాడులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు భారత వైమానిక దళాధిపతి.. ఎయిర్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. శత్రు దేశాలు విసిరే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఐఏఎఫ్‌ 26వ చీఫ్‌గా రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాల్ని గమనిస్తున్నామన్నారు. దేశాన్ని కాపాడటానికి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని.. ప్రభుత్వం ఆదేశిస్తే ఎలాంటి మిషన్‌ను అయినా పూర్తి చేస్తామన్నారు […]

మోడీ ఒకే అంటే బాలాకోట్ తరహా దాడులు మరోసారి ?
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Oct 01, 2019 | 12:41 PM

కేంద్రం ఆదేశిస్తే బాలాకోట్ లాంటి దాడులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు భారత వైమానిక దళాధిపతి.. ఎయిర్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. శత్రు దేశాలు విసిరే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఐఏఎఫ్‌ 26వ చీఫ్‌గా రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాల్ని గమనిస్తున్నామన్నారు. దేశాన్ని కాపాడటానికి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని.. ప్రభుత్వం ఆదేశిస్తే ఎలాంటి మిషన్‌ను అయినా పూర్తి చేస్తామన్నారు భదౌరియా.

వాయుసేనను ఆధునీకరించడం, అత్యాధునిక టెక్నాలజీని అభివృద్ధిపరచడం, సంక్లిష్ట సామర్థ్యాలను మెరుగుపర్చడం తన ముందున్న లక్ష్యాలని భదౌరియా పేర్కొన్నారు. రాఫెల్ జెట్ యుద్ధ విమానాలు చేరడంతో.. భారత వైమానిక దళ సామర్థ్యం.. చైనా, పాకిస్థాన్‌ల కంటే పైచేయి సాధించినట్లువతుందని అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ భారత వైమానిక దళానికి చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడం తనకు లభించిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు.