Breaking: గర్భిణీలు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.. కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతులు..

Breaking: గర్భిణీలు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.. కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతులు..
Pregnant

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణీ స్త్రీలు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చునని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది..

Ravi Kiran

|

Jul 02, 2021 | 7:28 PM

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణీ స్త్రీలు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చునని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్(ఎన్‌టీఎజీఐ) సిఫార్సులకు ఆరోగ్య శాఖ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. గర్భిణీ స్త్రీలు టీకాలు వేయించుకునేందుకు కోవిన్ పోర్టల్ ద్వారా లేదా సమీప కోవిడ్ టీకా కేంద్రానికి నేరుగా వెళ్లి వ్యాక్సినేషన్ కోసం నమోదు చేసుకోవచ్చునని తెలిపింది.

‘గర్బిణీ స్త్రీలకూ వ్యాక్సిన్ వేసేందుకు అనుసరించే మార్గదర్శకాలు, మెడికల్ ఆఫీసర్స్‌కు కౌన్సిలింగ్ కిట్స్, ఇతరత్రా మౌలిక సదుపాయాలను కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమకూర్చింది. ఇదిలా ఉంటే కేంద్రం ఆమోదించిన కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్-వి, మోడెర్నా వ్యాక్సిన్లు ఏవైనా కూడా పాలిచ్చే తల్లులకు, గర్భిణీ స్త్రీలకు సురక్షితమని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వికే పాల్ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోకుండా కోవిడ్ టీకాను వేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ భరోసా ఇచ్చింది. కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఇటీవలే 18 ఏళ్లు పైబడిన వారికీ కూడా వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో దేశంలో టీకాల పంపిణీ 34 కోట్లకు చేరువలో ఉంది.

Also Read: 

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లు..

సింగిల్‌గా ఉందని ఎండ్రకాయను రౌండప్ చేసిన సింహాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

టీమిండియాపై ట్రిపుల్ సెంచరీ.. 48 బంతుల్లో శతకం.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఆ ఓపెనర్ ఎవరంటే.!

రెస్టారెంట్‌ను పేల్చేస్తానంటూ కస్టమర్ ఫోన్.. కారణం ఆరా తీయగా మైండ్ బ్లాంక్.!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu