కోర్టుల్లో ఇక ‘ కృత్రిమ మేధస్సుతో ‘ తీర్పులు.. సాధ్యమేనా ?

దేశంలోని కోర్టుల్లో ‘ కృత్రిమ మేధస్సు ‘ సాయంతో తీర్పులు వెలువడనున్నాయా ? న్యాయవ్యవస్థ కోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను అభివృధ్దిపరచుకునే విధానం సాధ్యపడుతుందా ? ఉందనే అంటున్నారు సీజేఐ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే.. అయితే ఈ సిస్టం వచ్చినప్పటికీ ‘ మానవ న్యాయమూర్తులే ‘ ఉంటారని ఆయన స్పష్టం చేశారు.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న పదం ఈ మధ్య అదేపనిగా వినిపిస్తున్న సంగతి  తెలిసిందే. కంప్యూటర్ సాయంతో రోబోలే పని చేసే ఈ వ్యవస్థ ఈ […]

కోర్టుల్లో ఇక ' కృత్రిమ మేధస్సుతో ' తీర్పులు.. సాధ్యమేనా ?

దేశంలోని కోర్టుల్లో ‘ కృత్రిమ మేధస్సు ‘ సాయంతో తీర్పులు వెలువడనున్నాయా ? న్యాయవ్యవస్థ కోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను అభివృధ్దిపరచుకునే విధానం సాధ్యపడుతుందా ? ఉందనే అంటున్నారు సీజేఐ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే.. అయితే ఈ సిస్టం వచ్చినప్పటికీ ‘ మానవ న్యాయమూర్తులే ‘ ఉంటారని ఆయన స్పష్టం చేశారు.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న పదం ఈ మధ్య అదేపనిగా వినిపిస్తున్న సంగతి  తెలిసిందే. కంప్యూటర్ సాయంతో రోబోలే పని చేసే ఈ వ్యవస్థ ఈ మధ్య బాగా పాపులర్ అయింది.  ఈ రోబోలు ఇచ్ఛే తీర్పులు పక్కాగా, కచ్చితంగా ఉంటాయని ఇదివరకే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ బాబ్డే .. మన కోర్టుల వ్యవస్థకు కృత్రిమ మేధస్సును అభివృధ్దిపరచుకునే అవకాశాలు  ఉన్నాయని తెలిపారు. అయితే ఇది కేవలం తీర్పుల ప్రకటనలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికే అని ఆయన స్పష్టం చేశారు. ఒక్కోసారి న్యాయమూర్తులు కూడా ఇందుకు సంబంధించిన ప్రశ్నలు వేస్తుంటారని, కానీ ఈ సిస్టం వచ్చినంత మాత్రాన ‘ మానవ న్యాయమూర్తులు ‘ ఉంటారని తాను క్లారిటీ ఇచ్చానని ఆయన చెప్పారు. దేశంలోని అనేక కోర్టుల్లో లక్షలాది పెండింగ్ కేసులు ఉన్నాయని, ఇవన్నీ తీర్పుల కోసం ఎదురు చూస్తున్నాయని అన్నారు.’ కొంతమంది ఖైదీలు 10 నుంచి 15  ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్నారు. వారి అపీళ్ళను విచారించే పరిస్థితిలో మేం లేము..తీర్పులు ప్రకటించేందుకు హైకోర్టులు, సుప్రీంకోర్టు చాలాకాలం తీసుకోవలసి వస్తోంది.. చివరకు ఈ ఖైదీలను బెయిలుపై విడుదల చేయాలని కోర్టులు భావిస్తున్నాయి ‘ అని జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు.

కోర్టుల్లో పెండింగులో ఉన్న అనేక కేసుల నేపథ్యంలో ‘ ప్రీలిటిగేషన్ మీడియేషన్ ‘ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే దాదాపు మధ్యవర్తిత్వ సిస్టం అన్నది ఆయన భావనగా చెబుతున్నారు. కాగా-జడ్జీలు రాజ్యాంగ పరిధిలో పని చేయవలసిన పరిస్థితి ఉందని, వివిధ సమస్యలను వారు డీల్ చేయాల్సివస్తోందని ఆయన చెప్పారు.

Published On - 12:24 pm, Sun, 12 January 20

Click on your DTH Provider to Add TV9 Telugu