AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prashanth Kishore: మీకు రాసిస్తా.. ఆ కూటమి ఎన్నికల వరకు కూడా కొనసాగదు: ప్రశాంత్ కిషోర్

బిహార్‎లో ఏర్పాడిన జనతాదళ్ యునైటెడ్, బీజేపీ కూటమి ఎక్కువ కాలం కొనసాగదని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బిహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి అదే సింహాసనాన్ని దక్కించుకున్నారు నితీష్ కుమార్. దీనిపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Prashanth Kishore: మీకు రాసిస్తా.. ఆ కూటమి ఎన్నికల వరకు కూడా కొనసాగదు: ప్రశాంత్ కిషోర్
Prashanth Kishore
Srikar T
|

Updated on: Jan 28, 2024 | 7:45 PM

Share

బిహార్‎లో ఏర్పాడిన జనతాదళ్ యునైటెడ్, బీజేపీ కూటమి ఎక్కువ కాలం కొనసాగదని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బిహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి అదే సింహాసనాన్ని దక్కించుకున్నారు నితీష్ కుమార్. దీనిపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో పార్టీ నేత ఒక్కోవిధంగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, బిహార్ వాసి అయిన ప్రశాంత్ కిషోర్ మాత్రం సరికొత్త విషయాన్ని వెల్లడించారు. బిహార్ లో కొత్తగా ఏర్పాటైన కూటమి 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగదని జోస్యం చెప్పారు ప్రశాంత్ కిషోర్. బీజేపీ అధ్వర్యంలోని జేడీయూ ప్రభుత్వానికి ఏడాది లేదా అంతకంటే తక్కువ కాలం ఉండవచ్చని కిషోర్ తెలిపారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఈ కూటమి ఉండదని.. ఈ విషయాన్ని ‘మీకు రాతపూర్వకంగా రాసిస్తా’నన్నారు ప్రశాంత్ కిషోర్. అంతేకాకుండా లోక్ సభ ఎన్నికలు తరువాత ఆరు నెలల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని జోస్యం చెప్పారు. బిహార్‎లో బీజేపీ, జేడీయూతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే బిహార్ సీఎంగా నితీష్ కుమార్ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో నితీష్‎తో పాటు డిప్యూటీ సీఎంగా సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ప్రమాణ స్వీకారం చేశారు. తొమ్మిదవ సారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొత్త రికార్డును సృష్టించారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మంది మంత్రులు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, హిందుస్థాన్ ఆవామ్ మోర్చా నుంచి ఇద్దరు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us