పాక్‌ తీరు హాస్యాస్పదం.. మ్యాప్‌ విషయంపై భారత్‌

పాకిస్థాన్‌ విడుదల చేసిన కొత్త మ్యాప్‌పై భారత్‌ స్పందించింది. పాక్ రూపొందించిన కొత్త మ్యాప్‌ను పాక్ మంత్రి వర్గం ఆమోదించడమనేది హాస్యాస్పదమని స్పష్టం చేసింది. భారత భూభాగాలను పాక్ తన..

పాక్‌ తీరు హాస్యాస్పదం.. మ్యాప్‌ విషయంపై భారత్‌

పాకిస్థాన్‌ విడుదల చేసిన కొత్త మ్యాప్‌పై భారత్‌ స్పందించింది. పాక్ రూపొందించిన కొత్త మ్యాప్‌ను పాక్ మంత్రి వర్గం ఆమోదించడమనేది హాస్యాస్పదమని స్పష్టం చేసింది. భారత భూభాగాలను పాక్ తన కొత్త మ్యాప్‌లో తమవిగా చెప్పుకుంటూ ప్రకటించింది. దీనిని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్, మంత్రివర్గం మంగళవారం నాడు ఆమోదించింది. ఈ మ్యాప్‌కు తమ ప్రతిపక్షాలు కూడా మద్దతు పలికాయంటూ ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. ఈ మ్యాప్‌లో భారత్‌లోని జమ్ముకశ్మీర్, లదాఖ్‌లోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలను పాక్ తమవిగా చూపిస్తూ ప్రకటించాయి. అయితే దీనిపై భారత్‌ ఘాటుగా స్పందిస్తూ.. పాక్ మ్యాప్‌కు చట్టబద్ధత, అంతర్జాతీయ విశ్వసనీయ లేవని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

కాగా, ఇది డ్రాగన్‌ కంట్రీ అండ చూసుకునే పాక్ ఇలా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని తొలగించి ఏడాది గడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్‌లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా.. అక్కడ అధికారులు గట్టి బందోబస్తును
ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పాక్‌ ఇలా మ్యాప్‌ను విడుదల చేసి మరోకొత్త వివాదానికి తెరలేపింది.

Read More :

మహారాష్ట్రలో తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు

కొత్త మ్యాప్ అంటూ మన ప్రదేశాలతో.. పాక్‌ కన్నింగ్ వేషాలు

అయోధ్యకు చేరుకున్న ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌

శ్రీ శ్రీ రవి శంకర్‌కు అందని భూమి పూజ ఆహ్వానం

Click on your DTH Provider to Add TV9 Telugu