PM Narendra Modi: పెరిగిన పీఎం మోదీ ఆస్తులు.. ఆయన పేరుపై ఉన్న ప్రాపర్టీలేంటో తెలుసా?

ప్రధాని నరేంద్ర మోదీ మే 2014లో తొలిసారిగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత మే 2019 లో రెండవసారి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. అదే సమయంలో దాదాపు 13 ఏళ్ల పాటు గుజరాత్ సీఎంగా కూడా ఉన్నారు.

PM Narendra Modi: పెరిగిన పీఎం మోదీ ఆస్తులు.. ఆయన పేరుపై ఉన్న ప్రాపర్టీలేంటో తెలుసా?
Follow us

|

Updated on: Aug 10, 2022 | 6:15 AM

PM Modi Assets: నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టి 8 ఏళ్లు దాటింది. మే 2014లో తొలిసారిగా ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత, మే 2019 లో ఆయన రెండోసారి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. అదే సమయంలో దాదాపు 13 ఏళ్ల పాటు గుజరాత్ సీఎంగా కూడా ఉన్నారు. ఆయన అక్టోబర్ 2001 నుంచి మే 2014 వరకు ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించారు. అయితే చాలా కాలంగా ఉన్నత పదవుల్లో ఉన్న ప్రధాని మోదీ ఎన్ని ఆస్తులు కూడబెట్టారో తెలుసా? తెలిశాక మాత్రం కచ్చితంగా షాక్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రధానమంత్రి ఆస్తులు 2.23 కోట్లు..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొత్తం ఆస్తులు రూ.2.23 కోట్లు.. కాగా వాటిలో చాలా వరకు బ్యాంకుల్లో జమ చేయబడ్డాయి. అయితే, గాంధీనగర్‌లోని తన భూమిలో కొంత భాగాన్ని విరాళంగా ఇచ్చినందున ఆయన పేరుపై ఎటువంటి స్థిరాస్తులు లేవు.

ఇవి కూడా చదవండి

నాలుగు బంగారు ఉంగరాలు మాత్రమే..

ప్రధానమంత్రి కార్యాలయం (PMO) వెబ్‌సైట్‌లో ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం, మోదీకి బాండ్లు, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లలో ఎలాంటి పెట్టుబడులు లేవు. అయితే ఆయన వద్ద నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వాటి ధర రూ. 1.73 లక్షలు అని పేర్కొంది. మోదీ చరాస్తులు ఏడాది క్రితంతో పోలిస్తే రూ.26.13 లక్షలు పెరిగాయంట.

PMO వెబ్‌సైట్ ప్రకారం మార్చి 31, 2022 నాటికి మోదీ మొత్తం ఆస్తులు రూ. 2,23,82,504గా ఉన్నాయి. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అయన ఒక నివాస స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలం మరో ముగ్గురితో సంయుక్తంగా కలిగి ఉన్నారు. దానిలో అందరికీ సమాన వాటా ఉందంట.

తాజా సమాచారం ప్రకారం, రియల్ ఎస్టేట్ సర్వే నంబర్ 401/aలో ప్రధానమంత్రికి మరో ముగ్గురితో ఉమ్మడి వాటా ఉంది. వారిలో ప్రతి ఒక్కరికీ 25 శాతం వాటా ఉంది. విరాళంగా ఇచ్చినందున ఈ 25 శాతం కూడా ఆయన సొంతం కాదు. మార్చి 31, 2022 నాటికి ప్రధానమంత్రి వద్ద ఉన్న మొత్తం నగదు మొత్తం రూ. 35,250. పోస్టాఫీసులో రూ. 9,05,105 విలువైన జాతీయ పొదుపు సర్టిఫికెట్లు, రూ. 1,89,305 విలువైన జీవిత బీమా పాలసీలు ఉన్నాయి.

రాజ్‌నాథ్ సింగ్ చరాస్తులు 2.54 కోట్లు..

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా తమ ఆస్తులను ప్రకటించారు. రాజ్‌నాథ్ సింగ్ వద్ద మార్చి 31, 2022 నాటికి రూ. 2.54 కోట్ల చరాస్తులు ఉన్నాయి. అలాగే రూ. 2.97 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయంట. మోదీ కేబినెట్‌లోని మొత్తం 29 మంది సభ్యులలో ధర్మేంద్ర ప్రధాన్, జ్యోతిరాదిత్య సింధియా, ఆర్కే సింగ్, హర్దీప్ సింగ్ పూరి, పురుషోత్తమ్ రూపాలా, జి. కిషన్ రెడ్డి తమ సొంత ఆస్తులు, అలాగే వారిపై ఆధారపడిన వారి ఆస్తులను ప్రకటించిన వారిలో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా గత ఆర్థిక సంవత్సరంలో తన ఆస్తులను ప్రకటించారు. జులైలో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు.