PM MODI: ఈనెల 11వ తేదీన మహారాష్ట్ర, గోవాల్లో ప్రధాని పర్యటన.. వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న నరేంద్రమోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 11వ తేదీ ఆదివారం మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టునున్నారు. ఉదయం నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని.. అక్కడ వందే భారత్..

PM MODI: ఈనెల 11వ తేదీన మహారాష్ట్ర, గోవాల్లో ప్రధాని పర్యటన.. వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న నరేంద్రమోదీ
PM Modi
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Dec 10, 2022 | 7:26 AM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 11వ తేదీ ఆదివారం మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టునున్నారు. ఉదయం నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని.. అక్కడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఫ్రీడమ్ పార్క్ మెట్రో స్టేషన్ నుండి ఖాప్రీ మెట్రో స్టేషన్ వరకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మెట్రో రైలులో ప్రయాణిస్తారు. అక్కడ ‘నాగ్‌పూర్ మెట్రో మొదటి దశ’ను జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆయన ‘నాగ్‌పూర్ మెట్రో ఫేజ్-2’ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రధాని నాగ్‌పూర్, షిర్డీలను కలుపుతూ సమృద్ధి మహామార్గం యొక్క మొదటి దశను ప్రారంభిస్తారు. నాగ్‌పూర్‌లోని ఎయిమ్స్‌ను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. నాగ్‌పూర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. అలాగే 1500 కోట్ల రూపాయల విలువైన జాతీయ రైలు ప్రాజెక్టుతో పాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్ (ఎన్‌ఐవో), నాగ్‌పూర్, నాగ్ నది కాలుష్య నివారణ ప్రాజెక్ట్, నాగ్‌పూర్‌లకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

చంద్రపూర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్, టెక్నాలజీని దేశానికి అంకితం చేస్తారు ‘సెంటర్ ఫర్ రీసెర్చ్, మేనేజ్‌మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ హిమోగ్లోబినోపతి, చంద్రపూర్’ని కూడా నరేంద్రమోదీ ప్రారంభిస్తారు.

మద్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్రమోదీ గోవా చేరుకుంటారు. 9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ వేడుకలో ప్రధాని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ఆయన మూడు జాతీయ ఆయుష్ ఇన్‌స్టిట్యూట్‌లను కూడా ప్రారంభిస్తారు. సాయంత్రం గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..