PM Modi: ప్రధాని మోదీపై ప్రపంచ నేతల ప్రశంసలు.. క్వాడ్ సమ్మిట్‌లో కీలక పరిణామం..

అలాగే విల్మింగ్టన్‌లో జరిగిన క్వాడ్‌ సదస్సుకు మోదీ హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో పాటు ఆస్ట్రేలియా పీఎం, జపాన్‌ ప్రధానమంత్రి ఈ సదస్సులో పాల్గొన్నారు. ఇండో- పసిఫిక్‌ దేశాలు పరస్పర సహకారంతో అభివృద్ధిలో, అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని మోదీ ఆకాంక్షించారు. ఇండో- పసిఫిక్‌ రీజియన్‌లో క్యాన్సర్‌ టెస్టింగ్‌ కోసం...

PM Modi: ప్రధాని మోదీపై ప్రపంచ నేతల ప్రశంసలు.. క్వాడ్ సమ్మిట్‌లో కీలక పరిణామం..
PM Modi in Quad Leaders Summit
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 22, 2024 | 10:42 AM

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మూడు రోజుల పర్యటనలో భాగంగా మోదీ శనివారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి అమెరికాకు పయనమయ్యారు. ఇందులో భాగంగానే తొలి రోజు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో భేటీ అయ్యారు మోదీ. రెండు దేశాల మధ్య సంబంధాలపై చర్చించారు. మరోవైపు రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం.. ఇజ్రాయిల్‌-గాజా యుద్ధంపై కూడా ఇరువురు నేతలు చర్చించారు.

అలాగే విల్మింగ్టన్‌లో జరిగిన క్వాడ్‌ సదస్సుకు మోదీ హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో పాటు ఆస్ట్రేలియా పీఎం, జపాన్‌ ప్రధానమంత్రి ఈ సదస్సులో పాల్గొన్నారు. ఇండో- పసిఫిక్‌ దేశాలు పరస్పర సహకారంతో అభివృద్ధిలో, అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని మోదీ ఆకాంక్షించారు. ఇండో- పసిఫిక్‌ రీజియన్‌లో క్యాన్సర్‌ టెస్టింగ్‌ కోసం 7.5 మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించారు మోదీ. ఇండో- పసిఫిక్‌ దేశాలు పరస్పర సహకారంతో అభివృద్ధిలో, అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని మోదీ ఆకాంక్షించారు. ఇండో- పసిఫిక్‌ రీజియన్‌లో క్యాన్సర్‌ టెస్టింగ్‌ కోసం 7.5 మిలియన్‌ డాలర్ల సాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే.. హిందూ మహాసముద్రంలో నాయకత్వ పాత్ర పోషించినందుకు ప్రధాని మోదీ, భారతదేశాన్ని క్వాడ్ లీడర్స్ అభినందించారు.

జపాన్ ప్రధాని కిషిడా ప్రధాని మోదీని అభినందిస్తూ, వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్‌ల నిర్వహణకు ఆయన చేసిన చొరవను ప్రస్తావించడంతోపాటు.. మద్దతు ప్రకటించారు. ప్రధాని మోదీ హయాంలో హిందూ మహాసముద్రంలో భారతదేశం ప్రధాన శక్తి అని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ చెప్పారు. హిందూ మహాసముద్రంలో భారతదేశం అనుభవం, నాయకత్వం నుండి అమెరికా నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయని బైడెన్ ఈ సందర్భంగా చెప్పినట్లు తెలుస్తోంది.. క్వాడ్‌ను ప్రపంచ శక్తిగా అభివర్ణించిన ప్రధాని మోదీ.. భాగస్వామిగా ఉండటం, సహకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధమని చెప్పారు.

బైడెన్‌తో జరిగిన భేటీ తర్వాత భారత్‌లో సర్వైకల్‌ క్యాన్సర్‌ చికిత్స విధానంపై మాట్లాడారు ప్రధాని మోదీ. భారత్‌లో సర్వైకల్‌ క్యాన్సర్‌కి ట్రీట్‌మెంట్‌ విజయవంతంగా కొనసాగుతోందన్నారు మోదీ. మందులను తక్కువ ధరకు అందించేందుకు తాము ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సర్వైకల్‌ క్యాన్సర్‌ చికిత్స విధానాన్ని ఇతర దేశాలకు తెలియజేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. 2025లో క్వాడ్‌ సదస్సు నిర్వహించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు.

ఇక న్యూయార్క్‌లోని యూఏ జనరల్ అసెంబ్లీలో ప్యూచర్ సదస్సులో కూడా మోదీ పాల్గొననున్నారు. అదే విధంగా పలువురు వ్యాపార వేత్తలో మోదీ సమావేశమవుతారు. ఈ సందర్భంగా భారత్‌లో పెట్టుబడుల అంశంపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రధాని హోదాలో మోదీ అమెరికా పర్యటన వెళ్లడం ఇది తొమ్మిదో సారి కావడం విశేషం. ఇప్పటి వరకు తొమ్మిది మంది భారత ప్రాధానులు అధికారికంగా అమెరికా పర్యటన వెళ్లారు.

ఇక క్వాడ్ సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ఇండో- పసిఫిక్‌ దేశాలు పరస్పర సహకారంతో అభివృద్ధిలో, అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని మోదీ ఆకాంక్షించారు. ఇండో- పసిఫిక్‌ రీజియన్‌లో క్యాన్సర్‌ టెస్టింగ్‌ కోసం 7.5 మిలియన్‌ డాలర్ల సాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే.. హిందూ మహాసముద్రంలో నాయకత్వ పాత్ర పోషించినందుకు ప్రధాని మోదీ, భారతదేశాన్ని క్వాడ్ లీడర్స్ అభినందించారు.

జపాన్ ప్రధాని కిషిడా ప్రధాని మోదీని అభినందిస్తూ, వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్‌ల నిర్వహణకు ఆయన చేసిన చొరవను ప్రస్తావించడంతోపాటు.. మద్దతు ప్రకటించారు. ప్రధాని మోదీ హయాంలో హిందూ మహాసముద్రంలో భారతదేశం ప్రధాన శక్తి అని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ చెప్పారు. హిందూ మహాసముద్రంలో భారతదేశం అనుభవం, నాయకత్వం నుంచి అమెరికా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయని బైడెన్ ఈ సందర్భంగా చెప్పినట్లు తెలుస్తోంది.  క్వాడ్‌ను ప్రపంచ శక్తిగా అభివర్ణించిన ప్రధాని మోదీ.. భాగస్వామిగా ఉండటం, సహకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధమని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..