PM Narendra Modi: పెట్రోల్, డీజిల్ ధరల నియంత్రణకు ప్రధాని మోదీ ప్లాన్.. చమురు సంస్థల సీఈఓలతో కీలక భేటీ

PM Narendra Modi: దేశంలో కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని దిగ్గజ ఆయిల్ కంపెనీల సీఈఓలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ

PM Narendra Modi: పెట్రోల్, డీజిల్ ధరల నియంత్రణకు ప్రధాని మోదీ ప్లాన్.. చమురు సంస్థల సీఈఓలతో కీలక భేటీ
Pm Narendra Modi

PM Narendra Modi: దేశంలో కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని దిగ్గజ ఆయిల్ కంపెనీల సీఈఓలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం సమావేశమయ్యారు. వర్చువల్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మోదీ అతిపెద్ద కంపెనీలతో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, ప్రపంచంలోని అతిపెద్ద చమరు సంస్థ అయిన సౌదీ ఆరామ్​కో సీఈవో అమిన్ నాసర్, రష్యాకు చెందిన రోస్​నెఫ్ట్ సీఈవో డా. ఇగోర్ సెచిన్ సహా పలు కంపెనీల ప్రతినిధులతో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. పెట్రోలియం నిక్షేపాల అన్వేషణ, భారత్ లోని హైడ్రోకార్బన్ రంగంలో ఉత్పత్తి, ఉద్గారాల తగ్గింపు, పెట్టుబడి వంటి అంశాల గురించి ప్రధాని మోదీ సంభాషించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ హాజరయ్యారు. దేశంలో పెట్రోల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

దేశంలో కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. దేశీయ మార్కెట్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరుగుతుండటంతో వాహనదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ రోజు పెరిగిన ధరలతో ఢిల్లీలో ఒక లీటర్ పెట్రోల్ ధర రూ.106.19 కి చేరగా.. డీజిల్ ధర రూ.94.92 కి పెరిగింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.11 కి చేరగా.. డీజిల్ ధర రూ.102.89 కి చేరింది. అయితే.. చమురు ధరలను నియంత్రించేందుకు మోదీ సర్కార్ పలు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పెరుగుతున్న ధరలకు చెక్ పెట్టేందుకు ప్రధాని మోదీ చమురు సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిలో భాగంగా దేశంలో తక్కువగా ఉన్న ఇంధన ఉత్పత్తిని పెంచేందుకు కూడా చర్యలు తీసుకోనున్నారు.

Also Read:

Dengue Drug: వైద్యరంగంలో మరో ముందడుగు.. డెంగ్యూకి డ్రగ్‌.. అభివృద్ధి చేసిన సీడీఆర్‌ఐ.. వివరాలు..

CM KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. వారికి రైతు బంధు, రైతు బీమా రద్దు..

Click on your DTH Provider to Add TV9 Telugu