AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: చాలా ఆనందంగా ఉంది.. సుప్రీంకోర్టు డైమండ్‌ జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

సుప్రీంకోర్టు 75 ఏళ్ల నుంచి దేశంలో న్యాయం కోసం అనేక చర్యలు తీసుకుంటునట్టు తెలిపారు. సుప్రీంకోర్టు.. శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని నిరంతరం బలోపేతం చేసిందన్నారు. అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

PM Modi: చాలా ఆనందంగా ఉంది.. సుప్రీంకోర్టు డైమండ్‌ జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
CJI Justice D.Y. Chandrachud, PM Narendra Modi
Shaik Madar Saheb
|

Updated on: Jan 28, 2024 | 3:49 PM

Share

సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశంలో సత్వరన్యాయం అందించేందుకు సుప్రీంకోర్టు ఎన్నో కీలక తీర్పులను ఇచ్చిందని ప్రశంసించారు. సుప్రీంకోర్టు 75 ఏళ్ల నుంచి దేశంలో న్యాయం కోసం అనేక చర్యలు తీసుకుంటుందని.. శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని నిరంతరం బలోపేతం చేసిందంటూ గుర్తుచేశారు. అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛపై సుప్రీంకోర్టు అనేక ముఖ్యమైన తీర్పులను వెల్లడించిందని.. ఇది దేశ సామాజిక-రాజకీయ వాతావరణానికి కొత్తగా దిశానిర్దేశం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. నేడు చేస్తున్న చట్టాలు రాబోయే కాలంలో భారతదేశాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. భారత సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటై 75వ వసంతలంలోకి అడుగుపెట్టడం.. ఈ చారిత్రాత్మక రోజున అందరి మధ్య ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా న్యాయనిపుణులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

సుప్రీంకోర్టులో డిజిటలైజేషన్‌ కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయించినట్టు తెలిపారు మోదీ. సుప్రీంకోర్టు భవనం ఆధునీకరణకు రూ.700 కోట్ల నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా కోర్టుల ఆధునీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మోదీ. సుప్రీంకోర్టు డైమండ్‌ జూబ్లీ వేడుకలకు హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు మోదీ. ప్రస్తుత సుప్రీంకోర్టు భవనంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. సుప్రీంకోర్టు భవన సముదాయం విస్తరణ కోసం గత వారం ప్రభుత్వం రూ.800 కోట్లను ఆమోదించిందని గుర్తుచేశారు.

సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలకు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌తో పాటు న్యాయమూర్తులు, సీనియర్‌ న్యాయవాదులు , కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ హాజరయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us