PM Narendra Modi: శ్రీనగర్‌కు యునెస్కో గుర్తింపు.. జమ్మూకశ్మీర్ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు..

UNESCO Creative Cities - Srinagar: శ్రీనగర్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. యునెస్కో సృజనాత్మక నగరాల నెట్‌వర్క్‌లో

PM Narendra Modi: శ్రీనగర్‌కు యునెస్కో గుర్తింపు.. జమ్మూకశ్మీర్ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు..
Pm Narendra Modi
Follow us

|

Updated on: Nov 09, 2021 | 7:23 AM

UNESCO Creative Cities – Srinagar: శ్రీనగర్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. యునెస్కో సృజనాత్మక నగరాల నెట్‌వర్క్‌లో శ్రీనగర్‌కు చోటు కల్పిస్తూ యునెస్కో నిర్ణయం తీసుకుంది. హస్తకళలు, జానపద కళల విభాగంలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ (UCCN)లో శ్రీనగర్‌కు యునెస్కో చోటుకల్పించింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి 49 నగరాలను దీనిలో కొత్తగా చేర్చారు. క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో మొత్తం 90 దేశాల్లో 295 నగరాలు ఉన్నాయి. అయితే.. శ్రీనగర్‌తో పాటు గ్వాలియర్‌ను కూడా ఈ జాబితాలో చేర్చాలని గతంలో భారత్ యునెస్కోకు సిఫార్సు చేసింది. కానీ.. శ్రీనగర్‌కే అవకాశం క్రియేటివ్ సిటీస్‌లో చోటుకల్పిస్తూ.. యునెస్కో ప్రకటన చేసింది. కాగా.. యునెస్కో 2019లో హైదరాబాద్‌, ముంబై నగరాలను క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే.

కాగా.. అందమైన శ్రీనగర్‌కు ప్రత్యేక గుర్తింపు లభించడం ఆనందంగా ఉందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొ్నారు. క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ (UCCN) లో హస్తకళలు, జానపద కళలకు ప్రసిద్ధిగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది శ్రీనగర్ సాంస్కృతిక చరిత్రకు తగిన గుర్తింపు. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అభినందనలు.. అంటూ ప్రధాని మోదీ ట్విట్ చేశారు.

ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ట్విట్ చేసి వెల్లడించారు. శ్రీనగర్‌కు యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో క్రాఫ్ట్స్, జానపద కళల విభాగంలో చేర్చడం ఆనందంగా ఉందంటూ జమ్మూ కాశ్మీర్ ఎల్జీ కార్యాలయం ట్వీట్ చేసింది.

Also Read:

Hospital Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. నలుగురు చిన్నారుల మృతి

Subbirami Reddy: మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డికి భారీ షాక్‌.. ఓ కంపెనీ రూ.11 కోట్ల మోసం..!