PM Modi: భూటాన్ నుంచి నేరుగా ఆసుపత్రికి.. ఢిల్లీ పేలుడులో గాయపడ్డ వారికి ప్రధాని మోదీ పరామర్శ
భూటాన్‌లో విశ్వశాంతి సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశానికి చేరుకున్నారు. వెంటనే ఢిల్లీ పేలుడులో గాయపడ్డ వాళ్లను ప్రధాని మోదీ పరామర్శించేందుకు LNJP ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం పేలుడులో గాయపడ్డ వారిని పరామర్శించిన ప్రధాని మోదీ.. వారితో ప్రత్యేకంగా మాట్లాడారు..

భూటాన్‌లో విశ్వశాంతి సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశానికి చేరుకున్నారు. వెంటనే ఢిల్లీ పేలుడులో గాయపడ్డ వాళ్లను ప్రధాని మోదీ పరామర్శించేందుకు LNJP ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం పేలుడులో గాయపడ్డ వారిని పరామర్శించిన ప్రధాని మోదీ వారితో మాట్లాడారు.. బుధవారం థింపూ నుంచి ఢిల్లీకి చేరుకున్న మోదీ నేరుగా LNJP ఆస్పత్రికి వెళ్లి పేలుడులో గాయపడ్డ బాధితులను ఓదార్చారు. వాళ్లు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ LNJP ఆస్పత్రి డాక్టర్లతో మాట్లాడారు.. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఎలాంటి ప్రోటోకాల్ లేకుండానే మోదీ LNJP ఆస్పత్రిని సందర్శించారు. ఢిల్లీలో అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షిస్తామన్నారు ప్రధాని మోదీ. కుట్రదారులను పట్టుకొని శిక్షిస్తామన్నారు.
ఢిల్లీ పేలుడు బాధితులకు ప్రధాని మోదీ పరామర్శ..
Upon landing from Bhutan, PM Modi went straight to LNJP hospital to meet those injured after the blast in Delhi. He met and interacted with the injured and wished them a speedy recovery. He was also briefed by officials and doctors at the hospital. pic.twitter.com/FqQdk4d7w2
— ANI (@ANI) November 12, 2025
కాగా.. సోమవారం సాయంత్రం ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఉగ్ర కుట్ర వెనుక దాగున్న వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఢిల్లీ పేలుడు ఘటననలో.. ఇప్పటివరకు 18 మంది అరెస్ట్ అయ్యారు. అరెస్టయిన వారి కుటుంబసభ్యులను విచారించనుంది NIA. డాక్టర్ ఉమర్ కుటుంబాన్ని సైతం ఎన్‌ఐఏ విచారించనుంది.
కాగా.. ఢిల్లీ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. దేశరాజధానిలో 26/11 తరహా దాడులకు.. ఉగ్రవాదులు ప్లాన్ చేశారని దర్యాప్తు బృందాలు పేర్కొంటున్నాయి. 200 IEDలతో ఢిల్లీలో పలు ప్రాంతాల్లో పేలుడుకు ప్లాన్ చేసినట్లు సమాచారం ఎర్రకోట, ఇండియా గేట్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్..గౌరీశంకర్ ఆలయాల దగ్గర పేలుడు జరిపేందుకు కుట్ర చేశారని పేర్కొంటున్నారు. ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్‌లో.. భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు స్కెచ్ గీశారని నిఘావర్గాలు పేర్కొంటున్నాయి.. జనవరి నుంచి ఈ కుట్రకు పథకరచన జరిగిందన్న పోలీసులు.. ఈ టెర్రర్ మాడ్యూల్‌కు పాక్ సంస్థ జేషేకు సంబంధం ఉందని అనుమానిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




