PM Modi: ఇదొక మరపురాని సాయంత్రం.. ఆసక్తికర వీడియోను షేర్ చేసిన ప్రధాని మోడీ..

గుజరాత్‌లో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ రంగంలోకి దిగారు. వరుసగా ర్యాలీలో పాల్గొంటూ బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు.

PM Modi: ఇదొక మరపురాని సాయంత్రం.. ఆసక్తికర వీడియోను షేర్ చేసిన ప్రధాని మోడీ..
Pm Modi
Follow us

|

Updated on: Nov 28, 2022 | 11:06 AM

Gujarat Election 2022: గుజరాత్ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. దీంతో బీజేపీ సహా ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మొదటి విడత ఎన్నికలు గురువారం జరగనున్నాయి. దీంతో పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే, గుజరాత్‌లో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ రంగంలోకి దిగారు. వరుసగా ర్యాలీలో పాల్గొంటూ బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తూ బీజేపీని గెలిపించాలని జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ నాలుగు ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. కచ్‌లోని అంజర్ అసెంబ్లీ, భావ్‌నగర్‌లోని పాలిటానా, రాజ్‌కోట్, జామ్‌నగర్‌లలో మోడీ ప్రచారం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ.. మరుపురాని సాయంత్రం అంటూ.. ఓ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేశారు. ఆదివారం ప్రధాని మోడీ గుజరాత్‌లోని సూరత్‌లో పర్యటించారు. ఈ రోడ్ షోకు భారీగా జనం హాజరయ్యారు. మోడీ.. మోడీ.. నినాదాలు చేస్తూ హోరెత్తించారు. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా ప్రధాని మోడీ పంచుకుంటూ.. మరుపురాని సాయంత్రం అంటూ పేర్కొన్నారు.

సూరత్‌లో ప్రధాని రోడ్‌షో సందర్భంగా.. ప్రజలు ప్రధాని మోదీని చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. ప్రధాని మోడీ దగ్గరకు రాగానే ప్రజలు మోదీ-మోదీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. చాలామంది మోడీని చూసేందుకు ఇళ్ల బాల్కనీలపై, బస్సులపై నిలబడి ఉన్న మోదీ-మోడీ అంటూ నినాదాలు చేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది. రోడ్ షోకు భారీగా హాజరైన ప్రజలకు ప్రధాని మోడీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మోడీని చూసి.. చాలా మంది ఆనందంతో మురిసిపోతూ కనిపించారు. ఈ వీడియోను పంచుకున్న ప్రధాని మోదీ.. క్యాప్షన్‌ కూడా రాశారు.. సూరత్‌లో ఒక మరపురాని సాయంత్రం! నిన్నటి విశేషాలు ఇవే. మా అభివృద్ధి ఎజెండా వల్లే బీజేపీ.. ప్రజల అభిమానంగా మారింది. అంటూ రాశారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

గుజరాత్ ఎన్నికలలో విజయం సాధించేందుకు ప్రధాని మోడీ మాత్రమే కాదు, పార్టీకి చెందిన పలువురు ప్రముఖ నేతలు కూడా రంగంలోకి దిగారు. ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ సీట్లలో 54 సౌరాష్ట్ర-కచ్‌లో వస్తాయి. కావున సౌరాష్ట్ర-కచ్ అసెంబ్లీ ఎన్నికలకు అత్యంత ముఖ్యమైన స్థానంగా పార్టీలు భావిస్తాయి. సౌరాష్ట్ర-కచ్‌లో ఆధిపత్యం చెలాయిస్తే.. పార్టీ విజయం దాదాపుగా ఖారారైనట్లేనని పేర్కొంటున్నారు. అయితే, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి తక్కువ సీట్లతో బీజేపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అందుకే.. ఈ సారి మోడీ సహా అందరూ రంగంలోకి దిగారు.

182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య త్రిముఖ పోరు నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..