
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం చత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. రాయ్‌పూర్ లోని నవరాయ్‌పూర్ వాజ్‌పేయి నగరలో చత్తీస్‌గఢ్ కొత్త అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్మారక చిహ్నంతోపాటు.. గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియంను ప్రారంభించారు.. ఇది దేశంలో మొట్టమొదటి డిజిటల్ గిరిజన మ్యూజియం.. ఈ గొప్ప మ్యూజియం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, ఛత్తీస్‌గఢ్ గౌరవాన్ని నిలబెట్టడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన ఆదివాసీ ధైర్యవంతులకు అంకితం చేశారు. ఈ క్రమంలో చత్తీస్‌గఢ్ రజతోత్సవ వేడుకల్లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది.. ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన సమాజ సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సంభాషించారు.. ఈ క్రమంలోనే.. గిరిజనులు ప్రధాని మోదీతో మాట్లాడుతూ తమ మనసులోని మాటను బయటపెట్టారు. గిరిజన సంస్కృతిని అద్దం పట్టే సాంప్రదాయ తలపాగా.. నెమలి పింఛాలతో కూడిన పగిడిని బహుమతిగా ఇవ్వాలనుకున్నామని.. కానీ భద్రతా కారణాల దృష్ట్యా దానిని లోపలికి అనుమతించలేదంటూ.. గిరిజనులు ప్రధానికి వివరించారు. దీంతో ప్రధాని వెంటనే స్పందించారు.
వెంటనే ప్రధానమంత్రి మోదీ భద్రతా సిబ్బందిని పిలిచి ఈ విషయాన్ని చెప్పారు.. తలపాగాను లోపలికి తీసుకురావాలని ఆదేశించారు. వెంటనే వారు.. వేదిక పై నుండగా వారు.. ప్రధాని మోదీకి నెమలి పింఛాలతో కూడిన పగిడి బహూకరించారు. గిరిజన సంస్కృతి పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ ప్రధాని మోదీ దానిని వేదికపైకి స్వీకరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, చత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, మాజీ సీఎం రమణ్‌సింగ్ తదితరులు హాజరయ్యారు. చత్తీస్‌గఢ్ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన వేడుకలకు మోదీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. చత్తీస్‌గఢ్‌ను ఏర్పాటు చేసిన ఘనత మాజీ ప్రధాని వాజ్‌పేయికే దక్కుతుందన్నారు.. వాజ్‌పేయి స్వప్నం సాకారమయ్యిందన్నారు. చత్తీస్‌గఢ్ అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతోందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..