PM Modi: సహాయక చర్యలను వేగవంతం చేయండి.. మోర్బీ వంతెన బాధితులను పరామర్శించిన ప్రధాని మోడీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని మోర్బీలో పర్యటించారు. మోర్బీ బాధితులను పరామర్శించి ఓదార్చారు. మోర్బీలో ఆదివారం సాయంత్రం మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే.

PM Modi: సహాయక చర్యలను వేగవంతం చేయండి.. మోర్బీ వంతెన బాధితులను పరామర్శించిన ప్రధాని మోడీ..
Pm Narendra Modi
Follow us

|

Updated on: Nov 01, 2022 | 5:27 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని మోర్బీలో పర్యటించారు. మోర్బీ బాధితులను పరామర్శించి ఓదార్చారు. మోర్బీలో ఆదివారం సాయంత్రం మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 135 మంది మరణించారు. ఇంకా సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ప్రధాని మోడీ.. ఘటనాస్థలిని సందర్శించి.. పరిశీలించారు. ఆ తర్వాత ఆస్పత్రికి చేరుకుని.. ప్రమాదంలో గాయపడ్డ బాధితులను, వారి కుటుంబాలను పరామర్శించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమైన వారిని కూడా ప్రధాని మోడీ కలిశారు. ఆపరేషన్ గురించి ఆరా తీశారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. మోర్బీలో రెస్క్యూ ఆపరేషన్ ను వేగవంతం చేయాలని కోరారు. కేబుల్ వంతెన ప్రమాదం జరిగిన తీరును, సహాయక చర్యలపై గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, అధికారులు ప్రధాని మోదీకి వివరించారు.

కేబుల్‌ వంతెన కూలిన ఘటనలో 135 మంది చనిపోయారు. నదిలో చిక్కుకున్న 100 మృతదేహాలను వెలికితీయడానికి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌తో పాటు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను చేపడుతున్నాయి. ఈ ప్రమాదంపై గుజరాత్‌ ప్రభుత్వం నియమించిన సిట్‌ బృందం దర్యాప్తు చేస్తోంది. కెపాసిటీకి మించి జనం వంతెనపై చేరడం తోనే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా, ఈ ఆపరేషన్ వివరాలను మోడీ అడిగి తెలుసుకున్నారు. వంతెన కూలిన అనంతరం చేపట్టిన సహాయక చర్యలు.. ఇంకా తీసుకోవాల్సిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి

అంతకుముందు, ఈ ప్రమాదంపై సోమవారం రాత్రి ప్రధాని మోడీ అధికారులతో సమావేశమై, ఘటనలో నష్టపోయిన ప్రజలకు అన్ని విధాలుగా సహాయం చేయాలని అధికారులను కోరారు. ఈ ఘటనలో బాధిత ప్రజలకు అన్ని విధాలా సహాయం అందేలా చూడాలని ప్రధాని నొక్కిచెప్పారని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో చేపట్టిన సహాయక, సహాయక చర్యలను ప్రధానికి తెలియజేసారు. ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ కుమార్, గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే..

అక్టోబరు 30న ప్రమాదం జరిగిన తర్వాత.. ప్రమాదంలో మరణించిన వారికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి ప్రధానమంత్రి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మోర్బిలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రధాని మోడీ ప్రకటించారని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. గాయపడిన వారికి 50,000 అందజేయనున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఇతర అధికారులతో ప్రధాని మోడీ మాట్లాడి.. సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరారు.

ప్రధాని పర్యటనకు ముందు వివాదం..

ప్రధాని మోదీ మోర్బీ చేరకముందే వివాదం తలెత్తింది. వాస్తవానికి మోడీ పర్యటనకు ముందు రాత్రి, మోర్బిస్​​సివిల్ హాస్పిటల్‌లో జరుగుతున్న రంగుల పనిపై కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తింది. చాలామంది ప్రజలు చనిపోయినా.. వారు ఏదో ఈవెంట్‌ మాదిరిగా రంగుల కార్యక్రమంంలో నిమగ్నమై ఉన్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు ప్రధాని మోడీ సందర్శించే ఆసుపత్రిలో జరుగుతున్న పనుల ఫొటోలను కాంగ్రెస్ ట్విట్ చేసింది.

జాతీయ వార్తల కోసం..