‘హెడ్ లైన్ ఇచ్చి ఖాళీ పేజీ చూపిన మోదీ…ప్యాకేజీపై చిదంబరం

ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం పెదవి విరిచారు. ఆయన 'ఒక హెడ్ లైన్ ఇఛ్చి.. ఖాళీ (బ్లాంక్) పేజీ చూపినట్టు' ఈ ప్యాకేజీ ఉందన్నారు.

'హెడ్ లైన్ ఇచ్చి ఖాళీ పేజీ చూపిన మోదీ...ప్యాకేజీపై చిదంబరం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 13, 2020 | 1:23 PM

ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం పెదవి విరిచారు. ఆయన ‘ఒక హెడ్ లైన్ ఇఛ్చి.. ఖాళీ (బ్లాంక్) పేజీ చూపినట్టు’ ఈ ప్యాకేజీ ఉందన్నారు. అయితే ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ఈ ‘పేజీని’ ఎలా భర్తీ చేస్తారో చూడాల్సి ఉందని చిద్దూ ట్వీట్ చేశారు. ఎకానమీ ఊతానికి ప్రభుత్వం జొప్పించే ప్రతి అదనపు రూపాయినీ తాము జాగ్రత్తగా లెక్కిస్తామన్నారు. ఈ ప్యాకేజీ నుంచి ఏ రంగానికి ఎంత కేటాయిస్తారో చూస్తామని, ప్రభుత్వం మొదట పేదలు,ఆకలిగొన్నవారికి, వలస కూలీలకు ఏమేరకు ప్రయోజనం కలిగిస్తుందో చూడాల్సి ఉందన్నారు. రియల్ మనీ అంటున్నారు.. తొలుత అట్టడుగున ఉన్న 13 కోట్ల కుటుంబాలను ఆదుకోవలసిన అవసరం ఉంది అని చిదంబరం అన్నారు.

ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్యాకేజీ వివరాలను తెలియజేయనున్నారు. ‘ఆత్మ నిర్భర్ మిషన్’ లో ప్రతి సామాన్య వ్యక్తికీ లబ్ది చేకూరుస్తామని ఆమె చెప్పారు.