విచారణకు రండి.. రజనీకాంత్‌కు సమన్లు

తూత్తుకుడి ఘటన విషయంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు సమన్లు జారీ అయ్యాయి. ఈ కేసు విచారణ కోసం మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్‌ జగదీశన్‌ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేయగా.. ఆ కమిషన్ తాజాగా రజనీకి సమన్లను జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి రజనీకాంత్ ఫిబ్రవరి 25న తమ ఎదుట హాజరుకావాలంటూ అందులో ఆదేశించింది. అయితే గత ఏడాది తూత్తుకుడి రాగి కర్మాగారానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఆ సమయంలో పోలీసులు జరిపిన […]

విచారణకు రండి.. రజనీకాంత్‌కు సమన్లు

తూత్తుకుడి ఘటన విషయంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు సమన్లు జారీ అయ్యాయి. ఈ కేసు విచారణ కోసం మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్‌ జగదీశన్‌ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేయగా.. ఆ కమిషన్ తాజాగా రజనీకి సమన్లను జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి రజనీకాంత్ ఫిబ్రవరి 25న తమ ఎదుట హాజరుకావాలంటూ అందులో ఆదేశించింది.

అయితే గత ఏడాది తూత్తుకుడి రాగి కర్మాగారానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఆ సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో13 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన రజనీకాంత్ మాట్లాడుతూ.. కొన్ని అసాంఘిక శక్తులు ప్రవేశించడం వల్లే పోలీసులు కాల్పులు జరిపారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. ఆ తరువాత దీనిపై వివరణ ఇచ్చేందుకు నిరాకరించిన రజనీ.. తనకు అన్నీ తెలుసంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై కమిషన్ వివరణ కోరనున్నట్లు తెలుస్తోంది.

Published On - 7:34 am, Wed, 5 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu