Palaniswami: పళనిస్వామికే పగ్గాలు.. అన్నాడీఎంకే తాత్కాలిక కార్యదర్శిగా ఎన్నిక

Palaniswami: తమిళనాట శక్తిగా ఉన్న అన్నాడీఎంకేలో వర్గపోరు రచ్చకెక్కింది. క్రమశిక్షణకు మారుపేరైన అన్నాడీఎంకే పార్టీ ఇప్పుడు కోర్టుకెక్కింది. వ్యవస్థాపక అధ్యక్షుడిగా..

Palaniswami: పళనిస్వామికే పగ్గాలు.. అన్నాడీఎంకే తాత్కాలిక కార్యదర్శిగా ఎన్నిక
Palaniswami
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 11, 2022 | 2:51 PM

Palaniswami: తమిళనాట శక్తిగా ఉన్న అన్నాడీఎంకేలో వర్గపోరు రచ్చకెక్కింది. క్రమశిక్షణకు మారుపేరైన అన్నాడీఎంకే పార్టీ ఇప్పుడు కోర్టుకెక్కింది. వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎంజీ రామచంద్రన్‌ తరువాత పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత.. ప్రధాన కార్యదర్శిగా అన్నాడీఎంకేకు బలమైన పునాదులు వేశారు. అయితే జయలలిత మరణంతో ప్రధాన కార్యదర్శి పదవి కోసం పళనిస్వామి, పన్నీరు సెల్వం, శశికళ ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని పూర్తి తన చేతుల్లోకి తీసుకునేందుకు యత్నిస్తున్న ఈపీఎస్‌కు ముకుతాడు వేసేందుకు ఓపీఎస్‌ కోర్టుకెక్కారు.

అయితే అన్నాడీఎంకే అంతర్గత కుమ్ములాటలు క్లైమాక్స్‌కు చేరాయి. AIDMK కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పన్నీరు సెల్వం పిటిషన్‌ను కొట్టివేసింది. కార్యవర్గ సమావేశంపై నిషేధం లేదని స్పష్టం చేసింది. మద్రాస్‌ హైకోర్టు తీర్పుతో అన్నాడీఎంకే చీఫ్‌ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో జరగనున్న సర్వసభ్య సమావేశంతో పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుకు తెరపడే అవకాశం ఉంది.

ఇక తాజాగా అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి ఎన్నుకున్నారు. ఈపీఎస్‌ నియామక తీర్మానానికి ఆమోదం లభించింది. సమావేశంలో మొత్తం 16 తీర్మానాలకు ఆమోదం పొందగా, అన్నాడీఎంకేలో కోఆర్డినేటర్‌ పదవులను తొలగించారు. అయితే పళనిస్వామి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో కీలక నిర్ణయాలు తీసుకునేలా ఆమోదం తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇరు వర్గాల మధ్య ఘర్షణ

పార్టీ భవిష్యత్తు నాయకత్వ నిర్మాణాన్ని నిర్ణయించేందుకు అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం AIADMK కీలక జనరల్ కౌన్సిల్ సమావేశానికి అన్ని ఏర్పాటు పూర్తయ్యాయి. ఈ సమావేశానికి ముందు, పార్టీ ప్రధాన కార్యాలయం వెలుపల పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాలు ఘర్షణ పడ్డారు. ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గీయులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. జనరల్‌ కౌన్సిల్‌లో మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్న ఈపీఎస్‌ అన్నా డీఎంకే అధినేతగా ఎన్నికవుతారని భావిస్తున్నారు. అందుకే ఈ సమావేశం జరగకూడదని ఓపీఎస్‌ అడ్డుపడుతున్నారు. ఈ సందర్భంగా ఓపీఎస్‌పై ఈపీఎస్‌ వర్గీయులు వాటర్‌ బాటిళ్లు విసిరారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చెలరేగి ఘర్షణలకు దారి తీసింది. ఏఐడీఎంకే కార్యకర్తలు పలు వాహనాలను ధ్వంసం చేశారు.

చెన్నై శివారులోని వానగరంలో భారీగా పోలీసులు మోహరించారు. వానగరంలోనే కీలకమైన అన్నా డీఎంకే సమావేశం జరగనుంది. ఈపీఎస్‌, ఓపీఎస్‌ మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో ఈ సమావేశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈపీఎస్‌, ఓపీఎస్‌లలో గెలుపు ఎవరిదనే విషయంపై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. సమావేశంలో ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గీయుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు పార్టీ పరంగా కూడా హైటెక్ ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రో రైల్వే స్టేషన్ల తరహాలో క్యూ ఆర్ కోడ్, ఎంట్రీ ఐడీ కార్డు, సెక్యూరిటీ లాగిన్‌ వంటి జాగ్రత్తలు తీసుకుంటోంది ఈపీఎస్ వర్గం. తమకు ఐడీ కార్డులు అందలేదని ఓపిఎస్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. అన్నా డీఎంకే సర్వసభ్య సమావేశం జరగకుండా ఆపేందుకు ఓపీఎస్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..