దేశంలోకి చొరబడేందుకు యత్నించిన పాకిస్థానీ.. కాల్చి పడేసిన బీఎస్ఎఫ్..

నిన్న మొన్నటి వరకు కశ్మీర్‌ మీదుగా దేశంలోకి చొరబడేందుకు యత్నించిన పాక్.. తాజాగా రూట్‌ మార్చినట్లు ఉంది. ఆదివారం ఉదయం జరిగిన సీన్ చూస్తే.. అదే నిజమేమో అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం.. పంజాబ్‌లోని అత్తారీ బార్డర్‌లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్.. పాట్రోలింగ్ చేస్తోంది. ఈ సమయంలో తెల్లవారుజామున 5.30 నిమిషాలకు ఓ పాకిస్థానీయుడు సరిహద్దు గుండా లోనికి ప్రవేశించడాన్ని గమనించారు. అయితే అది గమనించి బీఎస్‌ఎఫ్.. వెంటనే సదరు వ్యక్తిని ఆగాలంటూ అనౌన్స్‌మెంట్ చేసింది. […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:52 pm, Sun, 26 April 20
దేశంలోకి చొరబడేందుకు యత్నించిన పాకిస్థానీ.. కాల్చి పడేసిన బీఎస్ఎఫ్..

నిన్న మొన్నటి వరకు కశ్మీర్‌ మీదుగా దేశంలోకి చొరబడేందుకు యత్నించిన పాక్.. తాజాగా రూట్‌ మార్చినట్లు ఉంది. ఆదివారం ఉదయం జరిగిన సీన్ చూస్తే.. అదే నిజమేమో అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం.. పంజాబ్‌లోని అత్తారీ బార్డర్‌లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్.. పాట్రోలింగ్ చేస్తోంది. ఈ సమయంలో తెల్లవారుజామున 5.30 నిమిషాలకు ఓ పాకిస్థానీయుడు సరిహద్దు గుండా లోనికి ప్రవేశించడాన్ని గమనించారు. అయితే అది గమనించి బీఎస్‌ఎఫ్.. వెంటనే సదరు వ్యక్తిని ఆగాలంటూ అనౌన్స్‌మెంట్ చేసింది. అయితే బీఎస్ఎఫ్ సిబ్బంది మాటల్ని పెడచెవున పెడుతూ.. అలాగే ముందుకు సాగాడు. దీంతో అనుమానం వచ్చి. అతన్ని షూట్ చేశారు. ఈ విషయాన్ని పంజాబ్ పోలీసులు తెలిపారు. సదరు పాకిస్థానీయుడు ఎందుకు ఇటువైపుగా వచ్చాడు..? దేని కోసం వచ్చాడు..? అన్న దానిపై దర్యాప్తు చేపడుతున్నారు.

అయితే పాకిస్థాన్‌ అక్రమంగా డ్రగ్స్‌ సరఫరా చేస్తుందా..? అందుకు ఇలా ఎవర్నైనా పాకిస్థానీయులను పంపంచారా..? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. బోర్డర్‌ నుంచి ఇవతలి వైపుకు హెరాయిన్ ప్యాకెట్లను విసురుతున్నట్లు అధికారులు ఇటీవలే గుర్తించారు. తాజాగా రెండు రోజుల క్రితం కూడా సరిహద్దుల్లో హెరాయిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. సైనికులను చూసి కాల్పులకు కూడా దిగారని.. అయితే మన సైన్యం వెంటనే ఎదురు కాల్పులకు దిగడంతో.. వెంటనే స్మగ్లర్లు పారిపోయారని అధికారులు తెలిపారు.