ఇది పాక్ పరిస్థితి.. ప్రధాని కార్యాలయానికి కరెంట్ కట్..!

ఇది పాక్ పరిస్థితి.. ప్రధాని కార్యాలయానికి కరెంట్ కట్..!

పాకిస్థాన్.. మన పొరుగు దేశం.. గత కొద్ది రోజులుగా మనపై యుద్ధం చేస్తామంటూ కాలు దువ్వుతుంది. కానీ ఆ దేశ పరిస్థితి చూస్తే.. అప్పుల కుప్పలే. ఎటు చూసినా నిధుల కొరత.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం పాక్ పరిస్థితి ఏలా ఉందంటే సాక్షాత్తూ ప్రధాని కార్యాలయానికి కరెంట్ ఉంటుందా.. ఊడుతుందా అన్నట్లు అయిపోయింది. దేశ ఖజానా ఖాళీ అవుతుండటంతో.. ప్రధాని కార్యాలయానికి కరెంట్ బిల్లు కట్టలేదంటా. కొన్ని నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో కరెంట్ కట్ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 29, 2019 | 7:36 PM

పాకిస్థాన్.. మన పొరుగు దేశం.. గత కొద్ది రోజులుగా మనపై యుద్ధం చేస్తామంటూ కాలు దువ్వుతుంది. కానీ ఆ దేశ పరిస్థితి చూస్తే.. అప్పుల కుప్పలే. ఎటు చూసినా నిధుల కొరత.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం పాక్ పరిస్థితి ఏలా ఉందంటే సాక్షాత్తూ ప్రధాని కార్యాలయానికి కరెంట్ ఉంటుందా.. ఊడుతుందా అన్నట్లు అయిపోయింది. దేశ ఖజానా ఖాళీ అవుతుండటంతో.. ప్రధాని కార్యాలయానికి కరెంట్ బిల్లు కట్టలేదంటా. కొన్ని నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో కరెంట్ కట్ చేస్తామని అధికారులు హెచ్చరించారట. ఈ విషయాన్ని అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి.

ఇమ్రాన్‌ఖాన్ కార్యాలయం గత కొన్ని నెలలుగా విద్యుత్ బిల్లులు కట్టలేదంటా.. ఇప్పటికి రూ.41 లక్షలు (పాక్ కరెన్సీలో) బకాయిలు ఉండటంతో బిల్లు చెల్లించాలంటూ ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లయ్ కంపెనీ నోటీసులు జారీ చేసింది. పలు మార్లు నోటీసులు పంపినా ప్రధాని కార్యాలయం నుంచి స్పందన రాకపోవడంతో.. బుధవారం మరోసారి నోటీసులు పంపింది. అయితే ఈ సారి బిల్లు కట్టకపోతే.. కరెంట్ కట్ చేస్తామని అధికారులు గట్టిగా హెచ్చరించారంటా.. ఇది ప్రస్తుత పాక్ పరిస్థితి. అయితే ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. భారత్‌తో యుద్ధం అంటూ ప్రగల్భాలు పలుకుతున్న ఇమ్రాన్.. మొదట కరెంట్ బిల్లు కట్టేందుకు డబ్బులు సంపాదించుకో అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu